వైసీపీపై పెమ్మసాని ఫైర్ * నాది అవినీతిపరుల స్క్రిప్ట్ చేదివే బ్లడ్ * మీకూ తెలుసు విక్టరీ ఎవరిదో. * వైసీపీ ఎంపీ అభ్యర్థి పై భగ్గుమన్న పెమ్మసాని. ‘700 ఎకరాలలో, 150 అడుగులు లోతు తవ్వింది నిజమా కాదా? అని ప్రశ్నిస్తే ఎవరో తవ్వారు అంటున్నారు. గెలుపు ఎవరిదో ఆయనకూ తెలుసని, వెనక్కి వెళ్లిపోదామంటే, తిన్న అవినీతి సొమ్ము ఖర్చు చేయాల్సిందేనన్న ఆ పార్టీ అధినేత హుకుంతో ఆగిపోయారని పేర్కోన్నారు. గ్రావెల్ తవ్వకాల వద్ద తీసిన డ్రోన్ షాట్స్ ప్రపంచానికి పొన్నూరు అవినీతిపరుడి బాగోతాన్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాయని తెలిపారు. వైసీపీ అవినీతిని చెప్పుకుంటూ పోవాలంటే ఎన్ని గంటలైనా చాలవని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు. అమెరికాలో ఉన్నా, ఆంధ్రాలో ఉన్నా, ఎవరైనా వెళ్ళాల్సింది పైకేనని, అదేదో తన ప్రజల హృదయాలు గెలుచుకుని వెళ్దామనే సొంత ప్రాంతానికి వచ్చానని చెప్పిన పెమ్మసాని వ్యాఖ్యలను జే జే ధ్వానాలతో స్వాగతించారు. తాము సొంత ఖర్చుతో మోటార్లు ఏర్పాటు చేయిద్దామన్నా అధికారులు అడ్డుపడుతున్నారని తెలిపారు.  గ్రామస్తులు సంతకాలు పెట్టి ఇచ్చిన వినతి పత్రాన్ని ఈ సందర్భంగా పెమ్మసానికి అందజేశారు. కాగా చంద్రశేఖర్ మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం రాగానే సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని తెలిపారు.