*పదేళ్లు మా ప్రభుత్వమే. * కృష్ణాయపాలెంలో విలేకరులతో డాక్టర్ పెమ్మసాని. ప్రజాజీవనం గాడిన పడాలంటే టిడిపి ప్రభుత్వం కనీసం 10 ఏళ్లకు తగ్గకుండా అధికారంలో ఉండాలని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. మంగళగిరి మండలం, కృష్ణయపాలెం గ్రామంలో టిడిపి నూతన కార్యాలయాన్ని పెమ్మసాని బుధవారం ప్రారంభించారు. పెమ్మసాని రాకను పురస్కరించుకొని గ్రామ శివారులు మొదలు టిడిపి కార్యాలయం వరకు భారీ ర్యాలీ నడుమ ఆయనను స్థానిక టిడిపి నాయకులు తీసుకువెళ్లారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ తన, తమ పార్టీ విజయాన్ని ప్రజలు ఎప్పుడో నిర్ణయించేశారని, ఇప్పుడు మెజారిటీపైనే తమ దృష్టి అంతా కేంద్రీకృతమై ఉందన్నారు. స్థానికంగా, మండల పరంగా రైతులకు పలు సమస్యలు ఉన్నాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారంపై ముందుగా దృష్టి పెడతామని డాక్టర్ పెమ్మసాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టిడిపి గ్రామ అధ్యక్షుడు ఆవల రవికిరణ్, ఈలప్రోలు శ్రీనివాసరావు, మంచికలపూడి వైష్ణవి, తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Final Speech
Candid Videos Link