కారంపూడి పాడు గ్రామంలో క్లస్టర్, యూనిట్ ఇంచార్జులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు డా. పెమ్మసాని ముఖ్య అతిథిగా, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి తర్వాత శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొన్నూరులో జరిగిన గ్రావెల్ అక్రమ తవ్వకాల అవినీతికి కారకులు ఎవరని ప్రశ్నించారు. లంటీర్ల ద్వారా ప్రజలను ప్రభుత్వం ప్రలోభ పెడుతుందని పెమ్మసాని చెప్పారు. మీ వాలంటీర్లకు చీరలు, గిఫ్టులు కావాలేమోకానీ, మా కార్యకర్తలకు ఎన్టీయార్ పంచిన పౌరుషం, బాబు నేర్పిన క్రమశిక్షణ చాలని పేర్కోన్నారు. పోలింగ్ బూత్ ల వద్ద తమ పార్టీ కార్యకర్తలు సింహాలై దూకుతున్నారు జాగ్రత్త అని వైసీపీని ఆయన సూచన ప్రాయంగా హెచ్చరించారు. ఇన్నేళ్లు ఎన్నో అవమానాలు, ఇబ్బందులు భరించినా జెండా వదలని కార్యకర్తలు మరో 50 రోజులు ఓపిక పట్టాలని ఆయన కోరారు.  ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ సమన్వయ కర్త వందనా దేవి, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి కొర్రపాటి నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం హరిబాబు తదితరులు పాల్గొన్నారు.