మంచాల గ్రామ పర్యటనలో భాగంగా పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రసంగం * పెమ్మసాని చంద్రశేఖర్ గారు: మండే సూర్యున్ని అరచేతిలో పట్టి ఆపగలమా! పవన్ కళ్యాణ్ ను ఇంట్లో ఉంచి ఆపగలరా! అని జగన్ ను అడుగుతున్నాను. అభివృద్ధి రూపంలో నేను, నరేంద్ర కలిసి ఓటర్ల రుణం తీర్చుకుంటాం. అందరికీ తెలుసు కిలారు రోశయ్య ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం పని చేశారని, ప్రజలకు ఏం మేలు చేశారని, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు? ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఛాన్స్ ఇచ్చిన ప్రజలపై జగన్ వేధింపులు ‘పాదయాత్ర చేసి ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ ను నమ్మి ప్రజలు ఓట్లేస్తే చివరకు ఆ ప్రజలనే ఈ జగన్ కక్షపూరితంగా వేదిస్తున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. చేబ్రోలు మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. కాగా చేబ్రోలు మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటుచేసిన ప్రచార ముగింపు సభలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర గార్లు మాట్లాడారు. పెమ్మసాని చంద్రశేఖర్: ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వానికి నిద్ర పట్టదని సభకు విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2019లో ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేసి మరీ అడిగిన జగన్ ను చూసి, పోనీ లే పాపమని ప్రజలంతా ఓట్లు వేశారన్నారు. 151 ఒక సీట్లు గెలిచిన తర్వాత కనీస కృతజ్ఞత లేకుండా ఈ జగన్ ప్రభుత్వం ప్రజలపై కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. ప్రజాధనంతో నిర్మించి ప్రజా వేదిక ఏ పాపం చేసిందని ఆ కట్టడాన్ని కూల్చే హక్కు మీకు ఎక్కడిదని జగన్ ను ఈ సందర్భంగా పెమ్మసాని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇస్తే, భూముల ధరలు పెరిగేలా అభివృద్ధి చేసి, ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను జగన్ మరిచిపోయారన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.12 వేల కోట్లను ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వటం చేతకాక ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన నిధులను చేజేతుల వదిలేసింది అని ఈ ప్రభుత్వ విధానాన్ని పెమ్మసాని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోలేని రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 27వ స్థానంలో నిలబడింది అని చెప్పడానికి సిగ్గుగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశారని ఆయన తిడుతున్నారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ పవన్ తన వెంట్రుక కూడా పీకలేరు అన్నారు, రాబోయే రోజుల్లో వెంట్రుక కాదు జగన్ గారు, త్వరలోనే మా ప్రజలు మీకు బోడిగుండు కొట్టబోతున్నారని ఈ సందర్భంగా పెమ్మసాని వివరించారు. ధూళిపాళ్ళ నరేంద్ర: 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం హయాంలో 25 వేలు జనాభా ఉన్న ఈ చేబ్రోలు మండలంలో ఏ న్యాయం జరిగింది అని ప్రశ్నించారు. ఐదేళ్లు పాలించమని జగన్ చేతిలో మన నియోజకవర్గాన్ని పెడితే చేతిలో మద్యం బాటిల్ పెట్టారని ఎద్దేవా చేశారు. చేబ్రోలు మండలం అంటేనే పురాతనమైన దేవాలయాలకు ప్రసిద్ధి, అలాంటిది ఆ దేవాలయాల ముందు కూడా మద్యం షాపులు పెట్టించి వ్యాపారం చేసిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిది అని అన్నారు. జగన్ నొక్కిన బటన్ నొక్కుళ్ళతో చేబ్రోలు మండలంలో ఏ ఒక్కరైనా లక్షాధికారి అయితే చూపించాలని, నిజంగా చూపిస్తే జగన్ కు సెంటర్లో సన్మానం చేస్తానని నరేంద్ర కుమార్ సవాల్ విసిరారు. చేబ్రోలు బ్రిడ్జి వద్ద రెండు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను. ప్రజల సహకారంతో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాను. ఓటు అనే మీ ఆయుధంతో నీ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, సైకిల్ కి ఓటెయ్యాలి అని కోరారు. నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ వడ్రానం మార్కండేయులు: రాష్ట్ర ‘భవిష్యత్తు కోసం ఆయన టిడిపి వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనార్ధం ఆయన తన ఆశయాలు పక్కనపెట్టి పనిచేస్తున్నారు. ఒక బలమైన ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్. 25 ఏళ్లు మెరుగురామంగా ప్రజలకు సేవ అందించిన పులిపాల్ల నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. ఇద్దరిని గెలిపించే దిశగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ రెండు ఓట్లు సైకిల్ పై వేసి తప్పకుండా గెలిపించాలి.’ అని మార్కండేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.”}” data-sheets-మంచాల గ్రామ పర్యటనలో భాగంగా పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రసంగం * పెమ్మసాని చంద్రశేఖర్ గారు: మండే సూర్యున్ని అరచేతిలో పట్టి ఆపగలమా! పవన్ కళ్యాణ్ ను ఇంట్లో ఉంచి ఆపగలరా! అని జగన్ ను అడుగుతున్నాను. అభివృద్ధి రూపంలో నేను, నరేంద్ర కలిసి ఓటర్ల రుణం తీర్చుకుంటాం. అందరికీ తెలుసు కిలారు రోశయ్య ఈ ఐదేళ్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి ఏం పని చేశారని, ప్రజలకు ఏం మేలు చేశారని, ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు? ప్రజలకు సమాధానం ఇవ్వాలి. ఛాన్స్ ఇచ్చిన ప్రజలపై జగన్ వేధింపులు ‘పాదయాత్ర చేసి ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్ ను నమ్మి ప్రజలు ఓట్లేస్తే చివరకు ఆ ప్రజలనే ఈ జగన్ కక్షపూరితంగా వేదిస్తున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. చేబ్రోలు మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. కాగా చేబ్రోలు మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద ఏర్పాటుచేసిన ప్రచార ముగింపు సభలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ధూళిపాళ్ల నరేంద్ర గార్లు మాట్లాడారు. పెమ్మసాని చంద్రశేఖర్: ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వానికి నిద్ర పట్టదని సభకు విచ్చేసిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. 2019లో ఒక్క ఛాన్స్ అని పాదయాత్ర చేసి మరీ అడిగిన జగన్ ను చూసి, పోనీ లే పాపమని ప్రజలంతా ఓట్లు వేశారన్నారు. 151 ఒక సీట్లు గెలిచిన తర్వాత కనీస కృతజ్ఞత లేకుండా ఈ జగన్ ప్రభుత్వం ప్రజలపై కక్షపూరితంగా వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు. ప్రజాధనంతో నిర్మించి ప్రజా వేదిక ఏ పాపం చేసిందని ఆ కట్టడాన్ని కూల్చే హక్కు మీకు ఎక్కడిదని జగన్ ను ఈ సందర్భంగా పెమ్మసాని ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు 33 వేల ఎకరాలను రాజధాని నిర్మాణం కోసం ఇస్తే, భూముల ధరలు పెరిగేలా అభివృద్ధి చేసి, ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను జగన్ మరిచిపోయారన్నారు. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ.12 వేల కోట్లను ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో మంజూరు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వటం చేతకాక ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన నిధులను చేజేతుల వదిలేసింది అని ఈ ప్రభుత్వ విధానాన్ని పెమ్మసాని ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వ నిధులను ఉపయోగించుకోలేని రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ 27వ స్థానంలో నిలబడింది అని చెప్పడానికి సిగ్గుగా ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశారని ఆయన తిడుతున్నారని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇటీవల ఒక సభలో మాట్లాడుతూ పవన్ తన వెంట్రుక కూడా పీకలేరు అన్నారు, రాబోయే రోజుల్లో వెంట్రుక కాదు జగన్ గారు, త్వరలోనే మా ప్రజలు మీకు బోడిగుండు కొట్టబోతున్నారని ఈ సందర్భంగా పెమ్మసాని వివరించారు. ధూళిపాళ్ళ నరేంద్ర: 2019-24 మధ్య జగన్ ప్రభుత్వం హయాంలో 25 వేలు జనాభా ఉన్న ఈ చేబ్రోలు మండలంలో ఏ న్యాయం జరిగింది అని ప్రశ్నించారు. ఐదేళ్లు పాలించమని జగన్ చేతిలో మన నియోజకవర్గాన్ని పెడితే చేతిలో మద్యం బాటిల్ పెట్టారని ఎద్దేవా చేశారు. చేబ్రోలు మండలం అంటేనే పురాతనమైన దేవాలయాలకు ప్రసిద్ధి, అలాంటిది ఆ దేవాలయాల ముందు కూడా మద్యం షాపులు పెట్టించి వ్యాపారం చేసిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిది అని అన్నారు. జగన్ నొక్కిన బటన్ నొక్కుళ్ళతో చేబ్రోలు మండలంలో ఏ ఒక్కరైనా లక్షాధికారి అయితే చూపించాలని, నిజంగా చూపిస్తే జగన్ కు సెంటర్లో సన్మానం చేస్తానని నరేంద్ర కుమార్ సవాల్ విసిరారు. చేబ్రోలు బ్రిడ్జి వద్ద రెండు కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ప్రజాసేవ చేస్తూనే ఉన్నాను. ప్రజల సహకారంతో ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటాను. ఓటు అనే మీ ఆయుధంతో నీ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి, సైకిల్ కి ఓటెయ్యాలి అని కోరారు. నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ వడ్రానం మార్కండేయులు: రాష్ట్ర ‘భవిష్యత్తు కోసం ఆయన టిడిపి వెన్నంటి ఉండి నడిపిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనార్ధం ఆయన తన ఆశయాలు పక్కనపెట్టి పనిచేస్తున్నారు. ఒక బలమైన ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు పెమ్మసాని చంద్రశేఖర్. 25 ఏళ్లు మెరుగురామంగా ప్రజలకు సేవ అందించిన పులిపాల్ల నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. ఇద్దరిని గెలిపించే దిశగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ రెండు ఓట్లు సైకిల్ పై వేసి తప్పకుండా గెలిపించాలి.’ అని మార్కండేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.