మెడికల్ ఇన్సూరెన్స్ కు కృషి చేస్తాం. + గుంటూరులో ఖచ్చితమైన మార్పు చూస్తారు. + పారా మెడికల్ సిబ్బంది ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని. ‘పారా మెడికల్ సిబ్బందికి ప్రధాన సమస్యగా ఉన్న మెడికల్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. సిబ్బందికి జీతాల పైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. నగరంలోని ఏ కన్వెన్షన్ లో ఆదివారం జరిగిన పారామెడికల్ సిబ్బంది ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు. ఆయనతోపాటు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, తూర్పు నియోజకవర్గం అభ్యర్థి నసీర్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. కాగా సమావేశంలో భాగంగా పలువురు సిబ్బంది పెమ్మసానితో మాట్లాడుతూ మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. ఏదేని ప్రమాదం ఎదురైనా భద్రత లేని జీవితాలు గడుపుతున్నామని వాపోయారు. సిబ్బంది సమస్యలను తెలుసుకున్న తర్వాత పెమ్మసాని గారు మాట్లాడుతూ కరోనా సమయములో కన్న బిడ్డల్ని సైతం వదిలి వైద్యం అందించిన వైద్య సిబ్బందికి వందనాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యులు, సిబ్బంది పైన దాడులు బాగా పెరిగాయని, భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా గుంటూరు నగరంలో గంజాయి, మత్తు మందులు పెరగడం వలన పిల్లల భవిష్యత్తులో సర్వనాశనం అయ్యే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఉద్యోగాలకు వెళ్లి రాత్రి వరకు పనిచేసే వచ్చే తల్లిదండ్రులకు పిల్లలు ఎటు వెళ్తున్నారు? ఏం చేస్తున్నారో? అన్న భయంతో గడపాల్సిన పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అనంతరం మాట్లాడిన పిడుగురాళ్ల మాధవి పారా మెడికల్ సిబ్బంది అంటేనే కనిపించని హీరోలు అన్నారు. అవినీతి రహిత సమాజం కావాలంటే డెడికేషన్ తో పనిచేసే నాయకులు కావాలని తెలిపారు. ఓటు అడగడానికి వచ్చిన నాయకులను మీకే ఎందుకు ఓటేయాలని ఓటర్లు ప్రశ్నించిన నాడే నాయకుల్లో చలనం కలుగుతుందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ధరలు పెరిగాయి, ఆదాయాలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంక్షేమం చేశామని వైసిపి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం చోద్యంగా ఉందని వివరించారు. డా. శ్రీవిద్య సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, మైనారిటీ నాయకులు సయ్యద్ ముజీబ్, టిడిపి నగర డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Candid Videos Link
Camera Videos Link