నామినేషన్ రోజే ఎలక్షన్ అయిపోవాలి. + మహిళల భద్రత నిమిత్తం పొలిటికల్ సెన్సార్ బోర్డ్. + పెమ్మసాని ఊపిరి ఉన్నంతవరకు అమరావతిని టచ్ చేయలేరు. + ‘నారీ గళం’ సమావేశంలో పెమ్మసాని ‘మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన ఘనత రాజకీయ అవకాశాలు కల్పించిన ఎన్టీఆర్ ది. అలాంటి మహిళలకు రాజకీయంగా భద్రత కల్పించాలంటే పొలిటికల్ సెన్సార్ బోర్డ్ ఉండాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గుంటూరులోని స్థానిక సిద్ధార్థ గార్డెన్స్ లో బుధవారం జరిగిన ‘నారీ గళం’ సమావేశానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని గారు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు మహిళల ఉన్నతికి కృషి చేశారని, అలాంటి నాయకుల తర్వాత వచ్చిన జగన్ మహిళలపై కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా ఎదగాలని చెబుతూ చదువు, విజ్ఞానం ఉన్నప్పటికీ రాజకీయ శక్తిగా మహిళలను ఉన్నత స్థాయికి చేర్చడానికి సహకరిస్తుందని పేర్కొన్నారు. అందుకుగాను పార్లమెంట్ సాక్షిగా తన సహకారం తాను అందిస్తానని ఆయన చెప్పారు. రాజకీయంగా సోషల్ మీడియాకు ఒక సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడే మహిళలు ధైర్యంగా రాజకీయాల్లోకి రాగలరు అని పెమ్మసాని తెలిపారు. ఈ పెమ్మసాని ఊపిరి ఉన్నంతవరకు అమరావతిని గాని ఏపీని గాని ఎవరూ టచ్ చేయలేరని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. కాగా కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ నారీ గళం సమావేశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మహిళలు చురుకైన పాత్ర పోషించాలన్నారు. అన్ని వర్గాలకు, మతాలకు న్యాయం జరిగేలా చూడాలంటే కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మోదీ ఆధ్వర్యంలో భారతదేశ మూడవ అతి పెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని చెప్పారు. అభివృద్ధిని పరుగులు పెట్టించే చంద్రబాబు నాయుడు వంటి నాయకుడు, ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకే ఆవిర్భవించిన జనసేన కలిసి ప్రయాణిస్తున్న ఈ కూటమికి ప్రజలు సహకరించి ఎన్నికల్లో విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, మహిళా టిడిపి నాయకురాలు మాగంటి రూప, డాక్టర్ శ్రీ రత్న తదితర టిడిపి జనసేన బిజెపి మహిళా నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories