ఓటు వేయడం మీ హక్కు. * పెదపలకలూరులోని అపార్ట్మెంట్ వాసులతో డాక్టర్ పెమ్మసాని ప్రతి ఎన్నికల్లో అపార్ట్మెంట్ వాసుల ఓట్లే కీలకమని, ఆ ఓటు హక్కును ఓటర్లు ఉపయోగించుకోకపోతే, ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి బదులు ప్రజా కంఠక ప్రభుత్వం వచ్చే ప్రమాదం ఉందని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెద పలకలూరులోని తురకపాలెం వెళ్లే రోడ్ లో గల సత్య, ఆదిత్రి అపార్ట్మెంట్ల వాసులతో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ 2019లో చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేకపోయారని, ఫలితంగా ఒక అరాచక పాలనను 5 ఏళ్లుగా ప్రజలు భరించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో వచ్చిన మూడు యూనివర్సిటీలు మాత్రమే కనపడుతున్నాయని, కానీ ఆయన ప్రోద్భలంతో రావాల్సిన దాదాపు 40 కి పైగా వ్యవస్థలు, సంస్థలను జగన్ ఆపేసిన విషయం చాలామందికి తెలియదని ఆయన గుర్తు చేశారు. వైసీపీది కేవలం ఓట్ల రాజకీయమని, అపార్ట్మెంట్ల నుంచి దాదాపుగా ఓట్లు వేయడానికి రారనే నిర్ణయంతో జగన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా మరో వర్గాన్ని రెడీ చేసుకుని పెట్టుకున్నారని ఆయన తెలిపారు. చాలామంది తమ జీవితాంతం పొదుపు చేసిన సొమ్ముతో చిన్నచిన్న స్థలాలు కొనుగోలు చేసుకున్నారని, కొందరు వైసీపీ నాయకులు ఆ స్థలాలను కూడా కబ్జా చేశారని అన్నారు. ఇలా చిన్నాచితకా జీవితాలు మొదలు ప్రతి ఒక్కరి భవిష్యత్తును రూపుమాపే దిశగా జగన్ ప్రభుత్వం అడుగులు వేసిందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమను దీవించాలని, ప్రజలందరికీ తాము సేవ చేసుకుంటామని పెమ్మసాని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ రాక్షస పాలన పోయి, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని కోరారు. నిత్యావసర సరుకులు ధరలు జగన్ 300 శాతం పెంచారని, రకరకాల పన్నులు పెంచుకుంటూ వెళ్లారే తప్ప రోడ్లు, డ్రైన్లు, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారన్నారు. ఏ ఓటర్ ఓటు హక్కు ఏ పోలింగ్ బూత్ లో ఉన్నది ముందుగానే తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును కచ్చితంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎక్కడైనా 85 ఏళ్ల వయసు దాటిన వృద్ధులు ఉంటే వాళ్ళు తమ ఓటును పోస్టల్ ద్వారా ఉపయోగించుకోవచ్చని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరు ఉదయం 9-10 గంటలలోపే తమ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, ఎట్టి పరిస్థితిలో మధ్యాహ్నం దాకా వేచి చూడవద్దని ఆయన ఈ సందర్భంగా ఓటర్లను కోరారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కొర్రపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో దోచుకోవడం దాచుకోవడమే పాలనగా సాగింది అన్నారు. రాబోయే ఎన్నికల్లో సైకోను తరిమికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాకినేని పెద్దరత్తయ్య గారు, టిడిపి నాయకులు దుగ్గిరాల సీతారామయ్య గారు, ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ కొర్రపాటి నాగేశ్వరరావు గారు తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Candid Videos Link
Camera Videos Link