మసీదులో డా. పెమ్మసాని ప్రత్యేక పూజలు. * పెమ్మసాని చేతులమీదుగా అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరణ. ‘ కొన్ని కోట్ల మందికి అబ్దుల్ కలాం ఆదర్శప్రాయులని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. రంజాన్ మాసం పురస్కరించుకుని గుంటూరులోని స్థానిక పట్టాభిపురంలో గల అతీఖుర్ రెహమాన్ మసీదులో ముఫ్తీ ఇమామ్ మౌజాన్, ముస్లిం సోదరులతో కలిసి ఆయన శుక్రవారం రోజా విరమణ, నమాజ్, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మసీదుకు ఎదురుగా ఏర్పాటుచేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహావిష్కరణను గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, నియోజకవర్గ ఇన్చార్జి కోవెలమూడి నాని, తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలాం గారు ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడంలో చంద్రబాబు గారి సహకారం కూడా ఉందని తెలిపారు.
Tags: No Categories