ప్రజలకు అండగా ‘సూపర్ సిక్స్’. + 55వ డివిజన్ పర్యటనలో పెమ్మసాని. ‘జగన్ అరాచక పాలనను అరికట్టి, ప్రజలకు టిడిపి జెండా అండగా ఉంటుందని, అందుకు అనుగుణంగానే టిడిపి ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ భరోసా ఇస్తోంది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 55వ డివిజన్లో నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా చర్మకారులను, చిరు వ్యాపారులు, నివాసితులను పెమ్మసాని కలుసుకున్నారు. వృత్తి పరమైన, స్థానిక సమస్యలతో పాటు అధికార పార్టీ స్థానిక నాయకుల నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాగా ఇంటి పట్టాలు, తాగునీటి సమస్యలు, పెరిగిన కరెంటు చార్జీలు తదితర సమస్యలను ప్రజలు పెమ్మసాని ముందు ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ కేవలం రెండు నెలల్లో టిడిపి ప్రభుత్వం వస్తుందని, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నక్క ఆనంద్ బాబు ను కలిసిన పెమ్మసాని. మాజీ మంత్రి నక్కా ఆనందబాబును డాక్టర్ పెమ్మసాని శనివారం ఆయన పార్టీ కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సమస్యలపై, గతంలో టిడిపి తీసుకున్న అభివృద్ధి నిర్ణయాలపై ఈ సందర్భంగా ఇరువురు నాయకులు కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం గుంటూరు పార్లమెంట్ పరిధిలో అనతి కాలంలోనే పెమ్మసాని ప్రజల్లోకి దూసుకు వెళ్ళారని, అండగా ఉంటామని భరోసా ఇవ్వగలిగిన నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని ఈ సందర్భంగా ఆనంద్ బాబు అన్నారు.