ఇదీ వైసిపి బాగోతం. ఆటోనగర్ లోని టిడిపి ముస్లిం నాయకుల షాపులు దగ్ధం. షాపులు, 70 కార్లు బుగ్గిపాలు.ఎమ్మెల్యే అనుచరుల పనే అంటున్న బాధితులు నిన్న పర్యటనకు వచ్చారు. పర్యటనకు సహకరించని నాయకులను నోటికొచ్చినట్టు తిట్టారు. ఇవాళ షాపులు తగలబడ్డాయి. ఇది ఎవరి పనో ఇప్పటికైనా అర్థమైందా! బాధితులు అయితే వైసిపి నాయకుల పేర్లే చెబుతున్నారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శించారు. ఆటోనగర్లో పలువురు టిడిపి ముస్లిం నాయకులకు చెందిన షాపులు ఆదివారం దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో 70 కార్లు, పలు దుకాణాలు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఈ సందర్భంగా వివరించారు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించాలని కొందరు ప్రయత్నించినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా జరిగిన పనే అని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న డాక్టర్ పెమ్మసాని, నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ తో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ అర కిలోమీటర్ దూరంలో ఉన్న రెండు షాపులు అగ్ని ప్రమాదంలో ఎలా దగ్ధమవుతాయి? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అవి కూడా టిడిపి నాయకులకు చెందిన షాపులు మాత్రమే ప్రమాదానికి గురవుతాయా? అని నిలదీశారు. శనివారం నాడు ఆటోనగర్ కు వచ్చిన నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఎన్నికల పర్యటన నిర్వహించారని, అయితే స్థానిక ముస్లింలు ఎవరు వైసీపీ పర్యటనకు సహకరించలేదని తెలుస్తోందన్నారు. ఆ కక్షతోనే మరిసటి రోజున ఈ ప్రమాదం సృష్టించారని, బాధితులు ఆరోపిస్తున్నారని పెమ్మసాని తెలిపారు. జరిగిన ఘటనపై ఇప్పటికే తన వ్యక్తిగతంగా పోలీసులు ఉన్నతాధికారి అయిన ఐ.జి కి ఫిర్యాదు చేశానన్నారు. కారకులు ఎవరైనా సరే టిడిపి ప్రభుత్వం రాగానే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం అని స్పష్టం చేశారు. మహమ్మద్ నసీర్: కష్టపడి పనిచేసే వ్యక్తులు ఉన్న ఆటోనగర్ ను అగ్గి పాలు చేశారు. టిడిపికి మద్దతు ఇచ్చారన్న కక్షతోనే టిడిపి ముస్లిం నాయకులు షాపులపై కన్నెర్ర చేశారు. స్థానిక ముస్లిం నాయకుల మధ్యన వివాదాలు రేపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఈ ప్రమాదానికి కారణమని బాధితుల ద్వారా తెలుస్తుంది. ఎస్పీకి పెమ్మసాని ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడమే గాక సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తాం. మరోసారి ఇలా ఆస్తి నష్టాలు చేయాలని ప్రయత్నిస్తే ప్రయత్నించిన వారికి కూడా ఇలాంటి అగ్నితోనే సమాధానమే చెప్తాం జాగ్రత్త. ఈ పరిశీలన కార్యక్రమంలో టిడిపి నాయకులు నంబూరు సుభాని, మైనార్టీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దిరాల మ్యాని, టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టిడిపి నాయకులు షేక్ షౌకత్ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories