గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ… ఈసారి అధికారమార్పిడి కేవలం రాజకీయంగా అధికార మార్పిడికి సంబంధించినది కాదు.. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్ కు సంబంధించినది. అమరావతిని కాపాడుకోవడానికి, చదుకున్న బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలి. ఇవాళ హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందంటే అందుకు కారణం చంద్రబాబునాయుడు విజనే కారణం. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అమరావతి కూడా అభివృద్ధి చెంది ఉండేది. రాష్ట్రానికి మధ్యలో ఉంది, నీటి వనరులు ఉన్నాయని ఆనాడు అమరావతిని రాజధానిగా చేశారు.
ఈ సందర్భంగా పీఈపీఎల్ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ వాసులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. విజయవాడ-గుంటూరుని హైదరాబాద్-సికింద్రాబాద్ మాదిరి జంటనగరాలుగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. గత ఎన్నికల్లో లోకేష్ ఓటమి కారణంగా ఏం కోల్పోయామో గ్రహించాం. 2024లో లోకేష్ ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మంగళగిరి రైల్వే స్టేషన్ లో వివిధ రైళ్లకు స్టాప్ లేదని, బస్టాండులో కూడా రాత్రి 8తర్వాత బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.