పెమ్మసాని ఆధ్వర్యంలో చేరికలు. * తూర్పు నియోజకవర్గం వైసిపి నుంచి టీడీపీకి లోకి వచ్చిన దాసరి శ్రీనివాసరావు, అనుచరులు తూర్పు నియోజకవర్గంలోని షాప్ ఎంప్లాయిస్ కాలనీలో నివసించే దాసరి శ్రీనివాసరావు, ఆయన అనుచరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి చంద్రశేఖర్, తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఈ చేరికలు ఆదివారం జరిగాయి. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ… * పెమ్మసాని చంద్రశేఖర్: పార్టీలోకి కొత్తగా వచ్చినప్పుడు కొన్ని చిన్న చిన్న సమస్యలు సాధారణమని, వాటన్నిటిని తట్టుకొని అధిగమించి ముందుకు కొనసాగినంత కాలం, తాను అండగా ఉంటానని చెప్పారు. పెమ్మసాని పార్టీలోకి వచ్చాక టిడిపిలోకి చేరికలు పెరిగాయని, ఇది పార్టీ బలోపేతానికి మంచి సంకేతాలు అని ఆయన అన్నారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మ్యానీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్, మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Candid Videos Link