ప్రజా సంక్షేమమే టిడిపి ధ్యేయం. * తూర్పు నియోజకవర్గం పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. బడుగు బలహీనవర్గాల సంక్షేమం కోసం ఆవిర్భవించిన టిడిపి 40 ఏళ్లుగా అదే ఆశయంతో ముందుకు నడుస్తుందని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 14, 15 డివిజన్లలో పెమ్మసాని గారు అసెంబ్లీ టిడిపి అభ్యర్థి నసీర్ అహ్మద్ తో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాగా హుస్సేన్ నగర్, ఇందిరా కాలనీ, ఐపిడి కాలనీ వంటి పలు ప్రాంతాల్లో ఆయన తన పర్యటనను కొనసాగించారు. పర్యటన ముగింపు అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరంలో రోడ్లు, డ్రైన్లు, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కొరత స్పష్టంగా కనిపిస్తుందన్నారు. టిడిపి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ముందుగా ప్రజా సమస్యలపైనే దృష్టి పెడతామని ఆయన స్పష్టం చేశారు.  పర్యటన ఆసాంతం డివిజన్లలోని ప్రజలు ఇరువురు నాయకులకు స్వాగతం పలికారు. ఇళ్లలో నుంచి బయటకు వచ్చి మరీ పెమ్మసానికి, నజీర్ కు అభివాదాలు చేస్తూ, టిడిపి విజయానికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. పలుచోట్ల పెమ్మసాని, నసీర్ కు ప్రజలు హారతులు పట్టి విజయ తిలకం దిద్దారు. ఈ పర్యటనలో 14, 15 డివిజన్ లో ప్రెసిడెంట్లు బెమ్మసాని శీను, సూరే శీను, క్లస్టర్ ఇంచార్జ్ మల్లంపూడి శ్రీనివాస్ తో పాటు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories