క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం. * ఈస్టర్ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని. క్రీస్తు బోధనాలు మానవాళికి మార్గదర్శకంగా నిలుస్తాయని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈస్టర్ సందర్భంగా నగరంలోని ఆంధ్ర ఇవాంజెలికల్ లూథరన్ చర్చిలకు సంబంధించిన ఈస్ట్, వెస్ట్, నార్త్ చర్చిలను పెమ్మసాని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా చర్చి ఫాదర్స్ ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఈస్టర్ సందర్భంగా క్రైస్తవుల సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏసు క్రీస్తు పునరుత్థాన పవిత్ర దినం క్రైస్తవ లోకానికి పర్వదినమని, ప్రభువు చూపించిన ప్రేమ, శాంతి మార్గంలో నడవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.