కష్టపడి పైకి వచ్చాం బ్రదర్!.కష్టం విలువ తెలుసు కాబట్టే ప్రజల కష్టాలు తీర్చడానికి వచ్చాం.కాస్త నవ్వుతూ ఉండండి, ఆరోగ్యానికి మంచిది. రాజకీయ ప్రత్యర్థులకు పెమ్మసాని చురకలు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొల్లిపర మండలంలో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా చెవులూరు, మున్నంగి, వల్లభాపురం గ్రామాల్లో అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గారితో కలిసి ప్రచారం నిర్వహించారు. పర్యటించిన ప్రతి గ్రామంలోనూ స్థానికులు పూల వర్షం కురిపిస్తూ ఇరువురు నాయకులను ఆహ్వానించారు. ప్రతి వీధిలోను మహిళలు హారతులు పడుతూ ఘన స్వాగతం పలికారు. అనంతరం వల్లభాపురం కూడలిలో ప్రజలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడారు.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు: మేము ఒకప్పుడు తినడానికి లేక ఇబ్బంది పడ్డామని కొందరు ఏదేదో చెప్తున్నారు. అవును, మేము అప్పటి మాకున్న హోటల్లో కష్టపడి పని చేసాం. ఆ కష్టమే మాకు ఇప్పటికీ అలవాటయింది. ఒకప్పుడు మా హోటల్లో సర్వర్ లేకపోతే ప్లేట్లు కూడా తీశాం బ్రదర్! అందులో చెప్పుకోడానికి ఏమాత్రం వెనకాడబోను, ధైర్యంగా చెప్పుకోగలం. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్లం. * శత్రువు ఎదురొచ్చినా సరే నవ్వుతూ ఉండాలి, అప్పుడే ఆరోగ్యానికి మంచిది. సమాజాన్ని ముందుకు తీసుకెల్లేలా అభిమానం ఉండాలి. మన చుట్టూ ఉండే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఆ అభిమానం ఉండాలి. నలుగురికి కీడు చేసేది, ఉన్న ఉద్యోగాలు పాడు చేసేది, రాజధాని ప్రాంతాన్ని నాశనం చేసే అభిమానం ఎవరికైనా మంచిది కాదు. ఒక కియా సంస్థను తీసుకురావడానికి చంద్రబాబు ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కియా సంస్థ ద్వారా కొన్ని వందల ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అలా చంద్రబాబు ద్వారా ఏర్పడ్డ ఎన్నో సంస్థలు నేడు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితికి వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చింది. * వైసీపీ హయాంలో మద్యం ధర అంత భారీ స్థాయికి చేరడానికి కారణాలేంటి? ద్రవ్యోల్బణంలో ఎంత మార్పు వచ్చినా ఒకేసారి రూ. 100-200లు మార్పు ఎందుకు వస్తుంది? జగన్ మళ్ళీ గెలిస్తే ఆ మద్యం ధర రూ.500 కు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్నికల్లో ఆయన పెట్టే ఖర్చు మొత్తం ప్రజల నుంచే మళ్లీ వసూలు చేస్తారు. ఒకప్పుడు ఎన్నారైలు ఈ చుట్టు పక్కల స్థలాలు, పొలాలు కొనుక్కునేవారు. ఇవాళ ఏ ఒక్కరూ కొనుక్కునే పరిస్థితి లేదు, కనీసం తమ సొంత ప్రాంతమైన ఏపీకి రావాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. మనకే ఇక్కడ స్థలాలు కొనుక్కునే ఆసక్తి లేకపోతే, బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎలా కొంటారు అనేది ఆలోచించాలి. * 2014కు ముందు పరిస్థితులు తారు మారూ అయి ఒకసారి రాజధాని మారింది. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, రాజధాని ఏర్పడ్డాక ఆ రాజధానిని మళ్లీ మళ్లీ ఎలా మారుస్తారు? అమరావతిని రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన జగన్, మళ్ళీ రాజధాని ఎలా మార్చాలని ప్రయత్నిస్తున్నారు? నాదెండ్ల మనోహర్ గారు: ఒకప్పుడు కొల్లిపర మండలం తెనాలి నియోజకవర్గం లోని నెంబర్ వన్ గా ఉండేది. ప్రజలకు ప్రశాంతమైన జీవితం అందించాలని ప్రయత్నాలు చేశాం. ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు జరిగిన నష్టాన్ని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ. రూ. 100 లలో రూ. 4 లు మాత్రమే అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు. ఒక ట్యూబ్ లైట్ మార్చాలన్నా పంచాయతీల్లో నేడు నిధులు లేవు. సైడ్ కాలువల నిర్మాణానికి కూడా నిధులు లేని పరిస్థితిలో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. మన గురించి కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈసారి ఓటేద్దాం. ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది నేను, పెమ్మసాని కలిసి పక్కా ప్రణాళిక ద్వారా మీ ముందుకు వస్తాం.

Event Photos
Camera Videos Link