బీసీలకు అండగా ఉంటాం – పెమ్మసాని.తెనాలిలో జరిగిన బీసీ సమావేశం. తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ.మండపంలో గురువారం జయహో బిసి కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతోపాటు గ్రామ మండల స్థాయి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రజకులు: బీసీలను గాని, రజకులను గాని ప్రారంభం నుంచి ప్రోత్సహించింది టిడిపినేనని, నేడు టిడిపి తో కలిసిన జనసేనకు కూడా తాము అండగా ఉంటామని బీసీ నాయకులు తెలిపారు. తమలో ఒకరైన రజకుల జీవనోపాధి కోసం చెరువులు పూడికలు తీసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. అయితే నేటి సాంకేతిక విధానాన్ని ఉపయోగించి జీవన ఉపాధి ఉపయోగపడేలా మిషనరీ అందించి సహకరించాలి అని కోరారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: నందమూరి తారక రామారావు గారూ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని సార్లు ఎలక్షన్లు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా బీసీలు, రజకులు అందరూ టిడిపికి అండగా ఉన్నారు. శుభ్రంగా ఉండి, ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకోవడం అంటే నాకు ఇష్టం. కానీ అమెరికాలో అంత శుభ్రంగా ఐరన్ చేసి ఇచ్చే వ్యక్తులు లేరు. ఇప్పుడు అదే విషయాన్ని కొందరు సోదరులు మిషనరీ ఉపయోగించి పనిచేయాలన్న ఆలోచనలను నాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక వ్యక్తికి తన పనిపై శ్రద్ధ, భక్తి ఉన్నప్పుడే కొత్తదనంతో కూడిన ఆలోచనలు వస్తాయి. జగన్ తన పాలనలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రులను ప్రకటించారు. కానీ ఆ పదవుల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడు వల్ల అయినా ప్రజలకు ఉపయోగం జరిగిందా? ఆ నాయకులు జగన్ దగ్గరికి వెళ్తే కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా ఉండదు. ఎవరికి కుర్చీ వేయాలో, వేయకూడదు అనేది జగన్ తన కనుసైగల ద్వారా నిర్ణయిస్తారట! వైసీపీలో అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారిని తప్ప చెప్పుకోదగ్గ ఒక్క బీసీ నాయకుడిని కూడా ఆ పార్టీ తయారు చేయలేకపోయింది. తల్లిదండ్రులు ఒక వృత్తిలో ఉన్నంత మాత్రాన తరతరాలు అదే వృత్తిని అనుసరించాలని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి విద్య అనేది చైతన్యవంతులను చేయగల సాధనంగా ఉంటుంది. నేను కూడా చదువుకోగలిగాను కాబట్టే ఈ స్థాయికి చేరుకోగలిగాను. చంద్రబాబు గారి హయాంలో రాజధాని ప్రాంతంలో మూడు అద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు. చక్కని భవనాలు, సౌకర్యాలు, విద్యను బోధించే ఫ్యాకల్టీని అందించండి, యూనివర్సిటీకి కావలసిన సకల సౌకర్యాలు తాము అందిస్తామని బాబు గారు హామీ ఇచ్చిన తర్వాతే యూనివర్సిటీలు రాజధానికి వచ్చాయి. మరి ఐదేళ్లు గడుస్తున్నా సరే జగన్ సీఎం గా ఉండి కూడా కొత్త యూనివర్సిటీలు, పరిశ్రమలు తేలేకపోయారు. కనీసం ఉన్న సంస్థలు ఉన్నత స్థితికి చేరుకోగలిగేలా సౌకర్యాలు కల్పించలేకపోయారు. ఇలాంటి విచ్ఛిన్న రాజకీయాల చేసే జగన్ లాంటి నాయకులు ఉన్నప్పుడు ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఒక పెమ్మసాని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మనోహర్ వంటి నాయకులు వస్తూనే ఉంటారు. నాదెండ్ల మనోహర్: నారా చంద్రబాబునాయుడు గారు కానీ అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇతర నాయకులు కానీ తీసుకున్న నిర్ణయాలు ప్రజల మేలు కోసం తీసుకున్నవే. ప్రజల జీవన విధానంలో, ఆర్థిక విధానంలో మార్పు తీసుకురావడానికి చేసిన నిర్ణయాలు. బలహీనవర్గాల కోసం పోరాడిన నాయకులు ఎందరో తెనాలిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చే ఇతర నాయకుల్లా కాకుండా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సమిష్టిగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలను తీసుకురాబోతున్నారు. టిడిపి హయాంలో ఉండగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడింది కానీ, జగన్ ప్రభుత్వం కులాలవారీగా కార్పొరేషన్ లు విడగొట్టి కులాల మధ్యన చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసింది.
Rajakulla Atmiaya Samamvesam
Event Photos
Candid Videos Link
Camera Videos Link