కొందరి అవినీతి వల్లే నీటి సమస్య.పెమ్మసాని ఆధ్వర్యంలో ఉప్పలపాడు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ‘కేవలం అవినీతి అధికారులు, నాయకులు చేసిన కక్కుర్తి వలన గుంటూరు కార్పోరేషన్ పరిధిలో నీటి సమస్య తలెత్తింది. ఎన్నికలు పూర్తి కాగానే ఒక్కొక్కరి భాగోతం బయటపెడతాను, నీటి సమస్య పరిష్కరిస్తాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. పెదకాకాని మండలం ఎన్నికల ప్రచారంలో భాగంగా డాక్టర్ పెమ్మసాని తక్కెళ్ళపాడు, వెంకట కృష్ణాపురం, ఉప్పలపాడు, నంబూరు తదితర గ్రామాలలో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ ఉప్పలపాడులో సహకరిస్తున్న కార్యకర్తలను, ప్రజలను చూస్తుంటే అసలు ఈ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదనిపిస్తుంది అని తెలిపారు. పాదయాత్రకు వచ్చిన జగన్ ఎన్నో హామీలు ఇచ్చి వెళ్లారే తప్ప, ఐదేళ్లుగా జనం మొహం చూడడం మానేశారని ఎద్దేవా చేశారు. ఆయనేమో ఏసీ బస్సులో తిరుగుతూ, ప్రజల్ని అవస్థల పాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు గ్రామం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన వారికి డాక్టర్ పెమ్మసాని, దూలిపాళ్ల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ధూళిపాళ్ల మాట్లాడుతూ గ్రామంలో వేసిన ప్రతి రోడ్డు టిడిపి హయాంలో వేసిందే తప్ప ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఒక్క రోడ్డు కూడా నిర్మింపబడలేదని తెలిపారు. నీళ్లు ఇవ్వలేక సర్పంచ్, అధికారులు తిప్పలు పడుతున్నారని, నాలుగేళ్ల పది నెలలుగా చేయని నీటి సరఫరా కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. గుంటూరు ఛానల్ కు నిధులు సేకరించిందని జగన్ ప్రభుత్వం వచ్చాక తనకు నచ్చిన సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఇప్పుడు రద్దుకు సిద్ధంగా ఉన్న పరిస్థితులు చూసి కూడా జగన్ స్పందించడం లేదన్నారు.మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి ఇస్తా. + సీఎంగా ఉండి గంజాయిని అరికట్టలేవా? + నంబూరు పర్యటనలో డాక్టర్ పెమ్మసాని. ‘నాపై చూపించే అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగి ఇస్తా. బుద్ధి ఉన్న ఏ ఒక్కరు వైసీపీకి ఓటు వేయరు. నాసిరకం మద్యం కారణంగా ప్రాణాలు పోతున్నాయని ప్రజలు ప్రశ్నిస్తుంటే, ఎవరు తాగమన్నారని నిర్లక్ష్యంగా మాట్లాడే ఈ జగన్ కు సీఎంగా ఉండే అర్హత ఉందా?’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెదకాకాని మండలంలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తక్కెళ్ళపాడు, వెంకట కృష్ణాపురం, గోళ్లమూడి, ఉప్పలపాడు, నంబూరు తదితర గ్రామాల్లో డాక్టర్ పెమ్మసాని మంగళవారం పర్యటించారు. పొన్నూరు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచారంలో పెమ్మసాని, నరేంద్ర గారికి యావన్మంది ప్రజలు ఆహ్వానం పలికారు. దారి పొడవునా ఇరువురు నాయకులను పూల వర్షంలో ముంచెత్తారు. కాగా నంబూరు లో జరిగిన ముగింపు ప్రజాసభలో పెమ్మసాన్ని మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో చెట్లు నరికిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మాత్రమే అన్నారు. ఓటేసే ముందు గుణం నాయకత్వ లక్షణాలు వ్యక్తిత్వం చూడకుండా ఓటేస్తే అభివృద్ధి ఇలాగే కొంటుపడుతుందని ఆయన ఉదహరించారు. రైతులకు రెండు పంటలకు కూడా నీళ్లు ఇవ్వాలన్న ప్రణాళిక లేని సీఎంగా జగన్ ఉండి ఎవరికి ఉపయోగమని నిలదీశారు. తాకట్టు పెట్టడానికి రాష్ట్రంలో ఏమీ మిగలక, రాబోయే రెండేళ్లలో ప్రజలు తాగబోయే మద్యంపై కూడా ఈ జగన్ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక సీఎంగా ఉండి గంజాయిని కూడా అరికట్టలేవా? అని సభాముఖంగా పెమ్మసాని జగన్ ను ప్రశ్నించారు. అనంతరం ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ నంబూరులో కార్యకర్తల ఉత్సాహం చూస్తే వైసిపి నాయకులకు మరిగిపోతూ ఉంటుందేమోనని అన్నారు. 2014-19 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే నంబూరు కి కనెక్టివిటీ హైవే, గొల్లగూడెం రోడ్డు, నంబూరు నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా రోడ్లు వేసింది కూడా టిడిపినే అన్నారు. గుంటూరుగుంటూరు ఛానల్ పై డబుల్ వంతెన, మసీదులు నిర్మించినా, జీతాలు ఇచ్చినా, దుల్హన్ పథకం ఇచ్చినా అది టిడిపి ఆధ్వర్యంలోనే జరిగిందని వివరించారు. నంబూరు నడిబొడ్డున నిలబడి తామిచ్చిన పెన్షన్లు, వేసిన రోడ్లు, అభివృద్ధి పై సవివరంగా స్పష్టం చేయగలమని ఆయన వివరించారు. అవినీతి వల్లే గుంటూరుకు నీటి సమస్య – ఉప్పల వాడలో పెమ్మసాని. ‘కేవలం అవినీతి అధికారులు, నాయకులు చేసిన కక్కుర్తి వలన గుంటూరు కార్పోరేషన్ పరిధిలో నీటి సమస్య తలెత్తింది. ఎన్నికలు పూర్తి కాగానే ఒక్కొక్కరి భాగోతం బయటపెడతాను, నీటి సమస్య పరిష్కరిస్తాను. ఉప్పలపాడులో సహకరిస్తున్న కార్యకర్తలను, ప్రజలను చూస్తుంటే అసలు ఈ గ్రామంలో వైసీపీ కార్యకర్తలు ఉండే పరిస్థితి లేదనిపిస్తుంది. పాదయాత్రకు వచ్చిన జగన్ ఎన్నో హామీలు ఇచ్చి వెళ్లారే తప్ప, ఐదేళ్లుగా జనం మొహం చూడడం మానేశారు. జగన్ ఏసీ బస్సులో తిరుగుతూ, ప్రజల్ని అవస్థల పాలు చేస్తున్నారు.’ అని ఉప్పలపాడు గ్రామంలో పర్యటిస్తూన్న సందర్భంలో పెమ్మసాని మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా ఉప్పలపాడు గ్రామం నుంచి పలువురు వైసీపీ కార్యకర్తలు టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన వారికి డాక్టర్ పెమ్మసాని, దూలిపాళ్ల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. * అనంతరం ధూళిపాళ్ల మాట్లాడుతూ గ్రామంలో వేసిన ప్రతి రోడ్డు టిడిపి హయాంలో వేసిందే తప్ప ప్రస్తుత ప్రభుత్వం హయాంలో ఒక్క రోడ్డు కూడా నిర్మింపబడలేదని తెలిపారు. నీళ్లు ఇవ్వలేక సర్పంచ్, అధికారులు తిప్పలు పడుతున్నారని, నాలుగేళ్ల పది నెలలుగా చేయని నీటి సరఫరా కార్యక్రమాన్ని ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని ఎద్దేవా చేశారు. గుంటూరు ఛానల్ కు నిధులు సేకరించిందని జగన్ ప్రభుత్వం వచ్చాక తనకు నచ్చిన సంస్థకు కాంట్రాక్టులు కట్టబెట్టారని ఇప్పుడు రద్దుకు సిద్ధంగా ఉన్న పరిస్థితులు చూసి కూడా జగన్ స్పందించడం లేదన్నారు. కాగా పొన్నూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వడ్రానం మార్కండేయులు, పెదకాకాని మండల జనసేన అధ్యక్షుడు వెంకటరావు, టిడిపి రాష్ట్ర మైనారిటీ అధికార ప్రతినిధి మోసిఫ్, టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, టిడిపి నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ తదితర టిడిపి బిజెపి జనసేన నాయకులు యావత్ పర్యటనలో పాల్గొన్నారు.
Ponnur Road Show at Nambur
Event Photos
Candid Videos Link
Camera Videos Link
Drone Shot Link