పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం. * బంగారు వర్తక, వ్యాపారులతో డాక్టర్ పెమ్మసాని.పండ్ల మార్కెట్, పారిశుద్ధ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం లోని స్థానిక లాలాపేట్, పండ్ల మార్కెట్, బంగారపు కోట్ల బజార్ తదితర ప్రాంతాల్లో పెమ్మసాని, తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు వర్తక వ్యాపారులను కలిసిన ఆయన టిడిపి ప్రభుత్వం వస్తే ఏం చేయదల్చుకుంది అన్న అంశంపై అందరికీ అవగాహన కల్పించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ సిక్స్ లోని పథకాలను అందరికీ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుంటూరులో పలు సమస్యలు ఉన్నాయని, టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Event Photos
Final Speech
Candid Videos Link