చంద్రబాబును సీఎం చేసేదాకా విశ్రమించకూడదు. * టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో డా. పెమ్మసాని. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం టిడిపి పుట్టిందని, గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగాయి. తొలుత కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరణకు నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, తెనాలి శ్రావణ్ కుమార్ ఆవిష్కరించిన అనంతరం, నాయకులు అందరుకలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పెమ్మసాని గారు మాట్లాడుతూ తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీలో ఎలుగెత్తి చాటిన ఘనత ఎన్టీఆర్ ది అని, తెలుగువారి ప్రతిభను ప్రపంచ దేశాలకు చాటిచెప్పిన ఘనత చంద్రబాబు గారికే దక్కుతుంది అని తెలిపారు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ గతంలో ఎవరికీ అందని సంక్షేమ ఫలాలను ప్రజలకు టిడిపి వచ్చాకే అందజేసిందని అన్నారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని ఆయన చెప్పారు. అలాగే తాడికొండ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రైతు రుణమాఫీని మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్ ప్రారంభించారని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పోరాడిన పార్టీ టిడిపి నేనని ఆయన అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, జిల్లా మహిళా అధ్యక్షురాలు అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Candid Videos Link
Camera Videos Link