గుంటూరులోని స్థానిక లాలాపేటలో గల ఎక్బాల్ మసీదులో శనివారం జరిగిన ఉపవాస విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా ప్రవక్త ఆదేశానుసారం ముస్లిం సోదరులు ప్రతిష్టాత్మకంగా నెలపాటు పాటించే కఠోర ఉపవాస దీక్షలలో భాగంగా 12వ రోజు జరిగిన రోజా విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాగా మసీదులో ప్రత్యేక పూజలు, నమాజ్ కార్యక్రమాల్లో పెమ్మసాని పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పెమ్మసాని. గుంటూరులోని స్థానిక ఎల్బీ మార్కెట్(మాయా బజార్) లో శనివారం జరిగిన ఇఫ్తార్ విందులో డా. పెమ్మసాని పాల్గొన్నారు. సుమారు 500 మంది ముస్లిం సోదరులు పాల్గొనగా పెమ్మసాని ఈ విందులో వడ్డన చేశారు. ఈ కార్యక్రమాల్లో పెమ్మసానితో పాటు గుంటూరు తూర్పు నియజకవర్గ టీడీపీ అభ్యర్థి మొహమ్మద్ నసీర్ అహ్మద్, టీడీపీ నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ తదితర ముస్లిం సోదరులు పాల్గోన్నారు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని తారకరామ నగర్లో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలోనూ గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా. పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్, నగర టీడీపీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.