UWorld India నిరాశ్రయులకు ఇళ్లు నిర్మించడం నుండి ఆహార సేకరణ, నిధుల సమీకరణ వరకు వివిధ సామాజిక కార్యక్రమాలలో నిత్యం పాల్గొంటారు. ఇటీవల, UWorld భారతదేశ బృందం శిశు మంగల్ అనాథ శరణాలయంలో పిల్లలకు వంటచేసి భోజనాలు అందించడమే కాకుండా వారి సంక్షేమం కోసం ముఖ్యమైన సామగ్రిని కూడా అందించారు. మనం సేవ చేసే సమాజకాలలో సానుకూల ప్రభావాన్ని చూపించాలనే మన నిబద్ధతకు ఈ కార్యక్రమం నిదర్శన.
ధార్మిక భావంతో విద్యా సేవలు అందిస్తున్న చాలా సంస్థలకు లెక్కలేనన్ని విరాళాలు ఇచ్చారు.
స్థానిక పిల్లలకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను అందించేందుకు ప్రపంచ స్థాయి స్కూల్ని నిర్మించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, ప్రతిభ కలిగిన ఎందరో విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు.