డా. చంద్రశేఖర్ పెమ్మసాని

వ్యవస్థాపకుడు & CEO, UWorld

డా. చంద్రశేఖర్ పెమ్మసాని, బుర్రిపాలెం గ్రామం, తెనాలి, గుంటూరు జిల్లాలో 1976వ సంవత్సరం లో శ్రీమతి సువర్చల, సాంబశివరావు దంపతులకు జన్మించారు.

1993-94 ఎంసెట్‌ పరీక్షలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర స్థాయిలో 27వ ర్యాంక్‌ సాధించి మెడిసిన్‌లో ఫ్రీ సీటు అందుకున్నారు, ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో చేరి ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. తాను నేర్చుకున్న విద్యనే పదుగురికి పంచి “EY Entrepreneur of the year”గా కీర్తి సాధించారు. అకుంఠిత దీక్షతో అసాధారణ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేసి, గుంటూరు ప్రజలు గర్వపడే స్థాయికి చేరుకున్నారు.

అమెరికాలో వైద్యులుగా పనిచేసేందుకు USMLE పరీక్ష రాయవలసి ఉంటుంది. ఈ పరీక్షలోనూ హై పర్సంటైల్‌తో ఉత్తీర్ణులయ్యారు చంద్రశేఖర్‌. అయితే అందుకు 4 వేల డాలర్లు ఖర్చయ్యాయి. చాలామంది ఆశావహుల ఆర్థిక పరిస్థిని అర్థం చేసుకున్న చంద్రశేఖర్‌, తాను నేర్చుకున్న విద్య నుండి భావితరాల కోసం సరళమైన, చవకైన స్టడీ మెటీరియల్‌ను రూపొందించారు. అమెరికా వైద్య విద్యా రంగంలో అదో సంచలనం. ఈ స్టడీ మెటీరియల్‌తోనే “UWorld” సంస్థని సృష్టించి, చాలామంది వైద్య విద్యార్థులకు అండగా నిలిచారు.

“UWorld” స్టడీ మెటీరియల్‌ చదివినవారు సైతం హై పర్సంటైల్‌తో ఉత్తీర్ణులై, జీవితంలో అత్యున్నత స్థాయిలో స్థిరపడడం విశేషం. అందుకే ప్రపంచంలోని అత్యంత పరివర్తన కలిగిన విద్యా సంస్థల జాబితాలో “UWorld” నిలిచింది. ప్రస్తుతం వైద్యంతో పాటు నర్సింగ్‌, ఫార్మసీ, న్యాయవాదం, అకౌంటింగ్‌, ఫినాన్స్‌ సీఏ వంటి లైసెన్సింగ్‌ పరీక్షలకు శిక్షణను అందించేలా చేసింది.

మరిన్ని
ASU+GSV 2023
Play Video about ASU+GSV 2023
డా. చంద్ర @ Great Leadership in Complex Times | ASU+GSV 2023
ASU+GSV 2022
డా. చంద్ర @ Unicorn Panel on Stage X | ASU+GSV 2022
ASU+GSV 2019
Play Video about ASU+GSV 2019
డా. చంద్ర @ 2019 ASU GSV Summit: Driving Disruption in Medical Education
Dr. Chandra @ Unicorn Panel on Stage X | ASU+GSV 2023
Play Video about Dr. Chandra @ Unicorn Panel on Stage X | ASU+GSV 2023
డా. చంద్ర @ Unicorn Panel on Stage X | ASU+GSV 2023

అవార్డులు & గుర్తింపు