*రాయిని శిల్పంగా మార్చగల వడ్డెర*. ఇంజనీర్లతో పోటీ పడగల నైపుణ్యం వడ్డెరలకు ఉందని టిడిపి యువ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ లో ఆదివారం ఉదయం జరిగిన వడ్డెర యువగర్జన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ భార్యా-భర్త కష్టపడ్డా ఇల్లు గడవని దుస్థితిలో వడ్డెరలు ఉన్నారని, టిడిపి పుట్టిన నాటి నుంచి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే పనిచేస్తుందని ఆయన చెప్పారు. వడ్డెరల సమస్యలను బాబు, లోకేష్, పవన్ ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా ప్రయత్నిస్తానని చెప్పారు. వెనుకబడిన వర్గాల వారికి అవకాశాలు రాకపోయినా పట్టుదలతో కృషి చేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగ వచ్చని సూచించారు. తాను కూడా ఓ బీద కుటుంబం నుంచి వచ్చిన వాడినేనని చెబుతూ, ఆ సమయంలో తన కృషి, పట్టుదలే తనకు అండగా నిలిచాయని ఈ సందర్భంగా ఆయన పెమ్మసాని గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి గుంటూరు నగర ప్రెసిడెంట్ డేగల ప్రభాకర్, బిజెపి నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ, వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Final Speech
Candid Videos Link