తాడికొండ మండలం లోని లాం గ్రామంలో సోమవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్: నేడు టిడిపిలో చేరిన కార్యకర్తల్లో షేక్ మీరా, బషీర్, షాజహాన్ తదితరులున్నారు. వైసీపీ పై విరక్తి చెంది ఆ కార్యకర్తలంతా టీడీపీలో చేరారు. పార్టీ మారాలన్న ఆలోచన వచ్చిందే మొదలు ఆ కార్యకర్తలపై వైసీపీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. జగన్ కూడా అలాంటి వారే.  అని పెమ్మసాని మాట్లాడారు. కార్యక్రమం అనంతరంకార్యక్రమం అనంతరం ప్రచార ర్యాలీని ప్రారంభించిన డాక్టర్ పెమ్మసాని లాం గ్రామంలోని పలు ప్రాంతాలలో వ్యక్తులను, వర్గాలను కలుసుకొని ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని మరీ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేలా అందరికీ వివరంగా తెలియజేశారు.