ప్రచార పిచ్చిలో జగన్ పాలన.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులు స్వాహా. అమరావతిని రాజధాని చేయమంటే వినిపించుకోని జగన్. పొన్నూరు నియోజకవర్గ పర్యటనలో పెమ్మసాని. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధూళిపాల్ల నరేంద్ర కుమార్ గారితో కలిసి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు పొన్నూరు పట్టణంలో మంగళవారం పర్యటించారు. పట్టణంలో గల మున్సిపల్ ఆఫీస్ నుంచి ప్రారంభమైన పర్యటన షరాఫ్ బజార్, ఐలాండ్ సెంటర్, నిడుబ్రోలు, రైల్వే స్టేషన్ రోడ్డు, చేనేత కాలనీ మీదుగా పెమ్మసాని పర్యటన కొనసాగింది. పర్యటన ప్రారంభమైన కాసేపటికి వర్షం ప్రారంభం కాగా జోరుగా కురుస్తున్న వర్షంలోనూ నాయకులు తమ ప్రచారాన్ని కొనసాగించారు. వర్షాన్ని కూడా లెక్క చేయక ముందుకు సాగుతున్న ఆ ఇరువురు నాయకులను చూసేందుకు, పలకరించేందుకు ప్రజలు కూడా విరివిగా పర్యటనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఐలాండ్ సెంటర్ కు పర్యటన చేరుకున్న అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ… పెమ్మసాని చంద్రశేఖర్ గారు: జగన్ ప్రభుత్వం ప్రజల మీదకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రయోగిస్తుంది. ఈ చట్టం ద్వారా ప్రజల భూములు, పొలాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రమాదం ఉంది. తొలుత పాస్ పుస్తకాల్లో ఫోటోలు, తర్వాత సర్వే రాళ్లపై ఫోటోలు, ఇప్పుడు ఏకంగా ప్రజల ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం వద్ద ఉంచమంటున్నారు. జగన్ మూడు రాజధానులు నిర్మించారట! మరి అది ఎంతమందికి కనిపించిందో తెలియదు. గుంటూరు యావత్ ప్రజానీకం అమరావతిని రాజధానిగా చేయాలని అడుగుతుంటే మాత్రం ఆ జగన్ గారికి వినిపించడంలేదు. 33 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వం చేతిలో పెడితే అక్కడ రాజధాని నిర్మించడం ఈ జగన్ కు చేతకాలేదు. నలుగురు కడుపునిండా అన్నం తినే అన్నా క్యాంటీన్లను రద్దు చేసిన ఈ జగన్ తనను తాను ప్రజాపక్షపాతి అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. జగన్ కు కక్ష, ఈర్ష్య తప్ప అభివృద్ధికి అర్థం తెలియదు. పొన్నూరు నియోజకవర్గంలోని 700 ఎకరాల్లో 200 అడుగుల అక్రమ తవ్వకాలు తప్ప ఎక్కడ చూసినా అభివృద్ధి కనిపించడం లేదు. నియోజకవర్గంలో అన్ని సమస్యలపై అవగాహన పరిష్కారానికి మార్గాలు తెలిసిన నాయకుడు నరేంద్ర గారు అందుబాటులో ఉన్నారు. అభివృద్ధి గురించి ఆలోచించే నరేంద్ర గారు, నేను కావాలో, ఒక్క ఛాన్స్ పేరుతో అరాచకాన్ని సృష్టిస్తున్న వైసిపి నాయకులు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. రాష్ట్రాన్ని, దేశాన్ని గాడిన పెట్టెందుకు అబ్దుల్ కలాం వంటి వ్యక్తిని రాష్ట్రపతిని చేసిన ఘనత టిడిపిది అయితే అబ్దుల్ సలాం వంటి వ్యక్తి కుటుంబం నిర్దాక్షిణ్యంగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. రంజాన్ తోఫా, మసీదుల మరమ్మతులకు నిధులు, వంటి సంక్షేమాలతో ముస్లింలను అప్పటి టిడిపి ప్రభుత్వం ఆదుకుంది. ఈ ఐదేళ్ల ప్రభుత్వంలో జగన్ ముస్లింలకు ఏం చేశారో ప్రకటించాలి. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర స్థాయిలో పనులు జరగాలంటే ఢిల్లీ నాయకుల మద్దతు కచ్చితంగా తీసుకోవాలి. ఆ ప్రయత్నంలో భాగంగా జరిగిందే కూటమి తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశమే లేదు. ధూళిపాల్ల నరేంద్ర కుమార్ గారు: ఇమామ్, మౌసన్ లకు జీతాలు ఇచ్చినా, కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసినా, రాష్ట్రంలో అభివృద్ధి చేసినా టిడిపి ప్రభుత్వంలో మాత్రమే జరిగాయి. ఈ అరాచక పాలనకు, విధ్వంసక పరిపాలనకు అంతం పలుకుదాం. అంబటి రాంబాబు క్యారెక్టర్ ఏంటో ఆయన అల్లుడే చెప్తున్నారు. అలాంటి అంబటి వచ్చి క్రికెటర్ అంబటి రాయుడిని విమర్శిస్తున్నారు. పొన్నూరు ప్రజల, నగరాభివృద్ధిని కోరుకునే నాకు, పెమ్మసాని గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ పర్యటనలో పొన్నూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త వడ్రాణం మార్కండేయ బాబు, బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, టిడిపి పట్టణ అధ్యక్షుడు అహ్మద్ ఖాన్ తదితర టిడిపి బిజెపి జనసేన నాయకులు పాల్గొన్నారు.
Event Photos
Candid Videos Link