ఈ గడ్డ పెమ్మసాని అడ్డా. * వందల లారీల ఇసుక తరలించకపోతున్నారు. * భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. * మా జోలికొస్తే మాత్రం గాంధీగిరి చెల్లదు * కొల్లిపర మండల టిడిపి-జనసేన నాయకుల ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని. ‘నేను ఈరోజు ఇంతటి వాడిని కావడానికి అమెరికాలోని శ్వేత, నల్ల జాతీయులే కారణం. నాకు నష్టం జరిగినా పర్వాలేదు కానీ, నా కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోం, చెయ్యి ఎత్తుతానంటే గాంధీగిరి అంటూ కూర్చోలేం. ఈ గడ్డ పెమ్మసాని అడ్డాగా మార్చి తీరుతాం.’ అంటూ టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన తెనాలి, కొల్లిపర, అంగలకుదురు తదితర ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడమే కాక భారీ వాహనాల ప్రయాణాల వల్ల రోడ్లన్నీ గుంతలు పడిపోయి వాహనదారులకు ప్రాణాపాయంగా మారుతున్నాయని తెలిపారు. సాయంత్రం అంగలకుదురు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పెమ్మసాని అనంతరం రోడ్డు షో లో పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామ వీధుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి అందరిని కలుసుకున్నారు. ఈ పర్యటనలో టిడిపి నాయకులు వీరవల్లి మురళి, గ్రామ ఉపసర్పంచ్ కనగాల నాగభూషణం, జడ్పిటిసి అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Candid Videos Link