జగన్ మద్యం బాటిళ్ళలో ప్రాణాంతక కెమికల్స్. చక్రాయపాలెం పర్యటనలో పెమ్మసాని.జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం బాటిళ్ళలో ప్రాణాంతక కెమికల్స్ ఉన్నాయి. స్వయంగా నేను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయించడం వల్ల అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. కొల్లిపర మండలంలోని జెముడుపాడు, జముడుపాడు పాలెం, చక్రాయపాలెంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో పాటు పర్యటించారు. కాగా చక్రాయపాలెంలో స్థానిక నాయకుడు అడపా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో తాము పర్యటిస్తున్న ప్రతి చోట వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి రూ. 750 కోట్లను జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు ఈ పిచ్చి బ్రాండ్లతో మద్యం బాటిళ్ళను అమాలని సలహా ఇచ్చారన్నారు. 151 సీట్లను ఇచ్చి పాలన చేయమంటే, జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారు అని విమర్శించారు. అధికారం శాశ్వతం అని భ్రమిస్తున్న జగన్ రైతాంగాన్ని ఏడిపిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన కొద్దినాళ్ళలో రైతులకు సాగు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. పాసు పుస్తకాలపై జగన్ ఫోటో అవసరమా!- నాదెండ్ల మనోహర్. రైతుల పొలాలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫోటోలు ఎందుకు వేస్తున్నారు? ఎవరి తాత, ముత్తాతల ఆస్తులపై ఎవరి ఫోటోలు వేస్తున్నారు? గడిచిన ఐదేళ్లు రైతాంగాన్ని అష్టకష్టాల పాలు చేశారు. జనసెనకు విలువలతో కూడిన రాజకీయం చేయడం మాత్రమే తెలుసునని, అందులో భాగంగానే పొత్తు నిర్ణయం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వేంకటేశ్వరావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తదితర స్థానిక, మండల స్థాయి టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు .
Tags: No Categories