మీ ఆస్తుల చిట్కా ప్రజలకు కూడా చెప్పండి. + విడుదల రజిని అఫీడవిట్ పై పెమ్మసాని చురకలు. + హాస్టల్, కళ్యాణ మండపం బాధ్యత మాది : పెమ్మసాని + ముస్లింలు మొదలు సామాన్యుల నుంచి విడుదల రజిని అక్రమ వసూళ్లు – మల్లెల రాజేష్ నాయుడు. ‘ఎలాగూ ఓడిపోతారు, ఏ నియోజకవర్గమైతే ఏంటన్నట్టు రజనీని గుంటూరుకు పంపారు. రజిని దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులకు, ఆదాయానికి సంబంధం లేదు. ఆ చిట్కా ఏదో పేద ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 18,19,20,22 డివిజన్లో పెమ్మసానితో పాటు పలువురు టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా వీధి వీధినా ప్రజలను కలుసుకుంటూ వారి స్థానిక సమస్యలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. మూడు, నాలుగు దశాబ్దాలకు పైగా స్థానికంగా నివసిస్తున్న తమకు ఇళ్ల పట్టాలు లేవని, నీటి, డ్రైనేజీ సమస్యలను ఎన్నిసార్లు అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు పెమ్మసానికి ఏకరువు పెట్టారు. సమస్యలను సావధానంగా విన్న తర్వాత పెమ్మసాని మాట్లాడుతూ నియోజకవర్గంలోని స్థానికుల సమస్యలను ఒక్కొక్కటిగా టిడిపి ప్రభుత్వం రాగానే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఇంటి పట్టా సమస్యలు కోర్టులో ఉన్నట్టు తెలిసిందని పరిష్కరించే అవకాశాన్ని బట్టి తప్పకుండా ప్రజలకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన హాస్టల్, కళ్యాణ మండపం నిర్మాణ బాధ్యతలు తాము చూసుకుంటామన్నారు. పిల్లలకు విద్య ద్వారానే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని, పేదరికం నుంచి బయటపడే ఏకైక ఆయుధం చదువు ఒకటేనని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. అలాగే పశ్చిమ వైసిపి అభ్యర్థిని విడుదల రజిని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇటీవలే సమర్పించిన అఫిడవిట్ గురించి ప్రస్తావిస్తూ ఆమె తన అఫిడవిట్లో అందజేసిన వివరాల ప్రకారం 2019కి ముందు ఆదాయం లేదని, అనంతరం రూ. 25 లక్షల ఆదాయం ఉన్నట్లు చూపించారని వివరించారు. అయితే ఆస్తులు మాత్రం రూ. 18.79 కోట్లు ఉన్నట్లుగా చూపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఆస్తుల చిట్కా ఏంటో చెబితే ప్రజలందరూ కోటీశ్వరులు అవుతారు కదా! అని ఆయన చమత్కరించారు. ఎన్నికల అధికారులైనా ఒకసారి ఆ అఫిడవిట్ ను పరిశీలిస్తే బాగుండేదని ఆయన కోరారు. చిలకలూరిపేటలో చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు గుంటూరుకు వచ్చారని, ఇక్కడ కూడా అదే అవినీతిని కొనసాగిస్తే ఆ భారం మొత్తం ప్రజలపైనే పడుతుందని ఆయన పేర్కొన్నారు. టిడిపి వల్లే సంక్షేమం సాధ్యం – పిడుగురాళ్ల మాధవి నిజమైన సంక్షేమం ఎలా ఉంటుందో టిడిపి ద్వారా తెలుస్తుంది. టిడిపికి ఓటు వేస్తే పథకాలు రద్దు చేస్తాం, పట్టాలు రద్దు చేస్తామంటూ బెదిరించే వాళ్ళకి చెంపపెట్టులా మీ ఓటుతో సమాధానం చెప్పండి. జగన్ చేసిన అప్పులకు ఇకమీదట అభివృద్ధి చేయలేరు. చేసిన అప్పులు తీర్చాలంటే మళ్లీ మళ్లీ అప్పులు చేయాల్సిందే. పోర్టులు సంక్షేమం అభివృద్ధి అనేది టిడిపి వల్లే సాధ్యం. ప్రభుత్వానికి స్థలాలు అప్పజెప్పి మంత్రి పదవి దక్కించుకున్నారు – మల్లెల రాజేష్ నాయుడు. ఎలాగూ ఓడిపోతారనే నమ్మకంతో, ఎక్కడైతే ఏంటి అనుకుని రజినిని జగన్ గుంటూరు పంపించారు. నాలుగు నెలలుగా మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని గుంటూరులో హడావిడి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే చిలకలూరిపేటలో నాలుగున్నరెళ్ళుగా రజని కుటుంబం చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. ముస్లింలకు ఖబర్ స్థాన్ కోసం రెండు ఎకరాలు కేటాయిస్తానని చెప్పి రూ. కోటిన్నర తీసుకుని ముప్పు తిప్పలు పెట్టారు. ఆమె మరిది, భర్త కలిసి ఏయే రూపాల్లో డబ్బు వస్తుందో వెతకడమే పనిగా పెట్టుకుంటారు. ఇక గుంటూరు విషయానికి వస్తే ప్రజలపై రజనీ టాక్స్ వేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. కాంట్రాక్టర్లు కమిషన్లు ఇవ్వలేదని ఎన్నో పనులు ఆపించిన ఘనత రజనిదే. ఈ పర్యటనలో సత్తెనపల్లి అసెంబ్లీ బిజెపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మైనారిటీ నాయకులు సయ్యద్ ముజీబ్, జిల్లా బిజెపి అధ్యక్షుడు వనమా నరేంద్ర వర్మ, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, జనసేన జిల్లా వైస్ ప్రెసిడెంట్ అడపా మాణిక్యం తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Event Photos
Final Speech
Candid Videos Link
Camera Videos Link