ఉమ్మడి అభ్యర్థులకు మా మద్దతు. – డా. పెమ్మసానితో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ‘బ్రాహ్మణుల మద్దతు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులకు తప్పకుండా ఉంటుంది.’ అని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య అన్నారు. గుంటూరులోని పార్లమెంట్ కార్యాలయానికి వచ్చిన ఆనంద్ సూర్య మర్యాదపూర్వకంగా డాక్టర్ పెమ్మసానిని బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఆనంద్ సూర్య మాట్లాడుతూ జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల గెలుపునకు తామంతా కృషి చేస్తామని వివరించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే గతం కంటే ఎక్కువగా సంక్షేమానికి కృషి చేద్దామని చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడేపల్లి సూర్యనారాయణ, ఆర్ బి ఎస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రకాష్ నందిరాజు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాచూరి విజయలక్ష్మి,కార్యదర్శి కల్పన నందిరాజు, సోషల్ మీడియా చీఫ్ కోఆర్డినేటర్ కాశీనాధుని సుధాకర్ ,రిటైర్డ్ తహసిల్దార్ శర్మ మరియు బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొన్నారు.
Event Photos