బ్రాహ్మణులకు అండగా ఉంటాం + బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని గుంటూరులోని స్థానిక గ్రంధి సీతారామయ్య కళ్యాణమండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఈ సందర్భంగా పలువురు బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ను తిరిగి ఏర్పాటు చేయాలని పెమ్మసాని, మాధవి, నసీర్ ను కోరారు. మూడేళ్లు వేద అభ్యాసం చేసుకునే బ్రాహ్మణ విద్యార్థులకు కల్పిస్తానని లోకేష్ గారు చెప్పారని తెలిపారు. బ్రాహ్మణ విద్యార్థులను విదేశాలకు పంపించిన ఘనత టిడిపిదేనని, బ్రాహ్మణులు, విద్యార్థులను ఈ జగన్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసిందని వివరించారు. అలాగే బ్రాహ్మణ భవన్ ను నిర్మింప చేసేలా చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణుల తరఫున తాము అడుగుతున్న ఈ పది డిమాండ్లను నెరవేర్చాలని ఈ సమావేశంలో పెమ్మసానిని పలువురు బ్రాహ్మణ నాయకులు కోరారు. అనంతరం పెమసాని మాట్లాడుతూ…. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: చీమకు కూడా హాని చేయని బ్రాహ్మణులపై అధికారపు మత్తుతో జగన్ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులు ఎవరైనా దేవాలయం, దేవున్ని ముట్టుకోవాలంటేనే భయపడతారు, కానీ ఈ ప్రభుత్వం దేవుళ్లను, దేవాలయాలను భ్రష్టు పట్టిస్తోందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిందే కాబట్టి తిరిగి దానిని అమలు చేయడం గాని, నిధులను కేటాయించడం వంటివి టిడిపి ప్రభుత్వం రాగానే కచ్చితంగా చేపట్టేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులను కేటాయించేలా చేస్తామని తెలిపారు. సామాన్యులు మొదలు పేదవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనది ఇల్లు అని, పేదల నివాసార్థం టిడిపి ప్రభుత్వం నిర్మాణం చేయించిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణులకు నా సాయశక్తులా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నాయకులు ఏపీఎంఐడిసి మాజీ చైర్మన్ రంగా వజ్జుల లక్ష్మీపతి, బిజెపి నాయకులు జూపూడి రంగరాజు, టిడిపి బ్రాహ్మణ సాధికార సంస్థ అధ్యక్షుడు బుచ్చి రామ ప్రసాద్, పెమ్మసాని రవిశంకర్, గల్లా రామచంద్రరావు పాల్గొన్నారు.
Tags: No Categories