Events

Dr Pemmasani's Public Programs
April 28, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Arya Vaisya Athmiya Samavesam
April 28, 2024    

Arya Vaisya Athmiya Samavesam

Tags: No Categories
Guntur East Road Show
April 27, 2024    

Guntur East Road Show

“గంజాయి ప్రభుత్వం – చర్చకు నే సిద్ధం.+ పదేళ్ల ఎమ్మెల్యే ఒక్క వీధిలో అయినా తిరిగారా?తూర్పు నియోజకవర్గ పర్యటనలో డాక్టర్ పెమ్మసాని’151 సీట్లు ఇచ్చి పాలన చేయమంటే, గంజాయి సరఫరా చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. జగన్ ప్రభుత్వపు అవినీతిపై చర్చకు నేను సిద్ధం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా 50, 51, 52, 53, 54, 55, 56 డివిజన్లలో నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ తో కలిసి పెమ్మసాని గారు పర్యటించారు. ప్రచారంలో పలు నివాసాలు వస్త్ర వాణిజ్య వ్యాపార సంస్థలను ప్రజలను ఆయన కలుసుకుంటూ ప్రచారం కొనసాగించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటూ, పలు వివరాలను సేకరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ…
పెమ్మసాని చంద్రశేఖర్ గారు: ఈ జన ప్రభంజనాన్ని చూస్తుంటే టిడిపి స్వీప్ చేస్తుందని స్పష్టమవుతుంది. రాజధానిని బాగు చేయమని కోరితే జగన్ గంజాయిని పెంచి పోషించారు. 2019కి ముందు జగన్ బ్రాండ్ల నాసిరకం మద్యం ఎక్కడైనా కనిపించిందా? రాజధాని ఎక్స్ప్రెస్, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ గోల్డ్, పవర్ స్టార్ అంటూ ఎప్పుడూ వినని పేర్లతో మద్యం బ్రాండ్లు ప్రజలపైకి వదిలారు. ఎమ్మెల్యే బంధువులు బందిపోట్లు మాదిరిగా నియోజకవర్గాన్ని దోచుకున్నారు. జగన్ ప్రభుత్వపు అవినీతిపై నేను చర్చకు సిద్ధం, రావడానికి మీరు సిద్ధమా? పదేళ్లుగా ఎప్పుడైనా ఈ వీధుల్లో, సందుల్లో ఎమ్మెల్యే తిరిగారా? కృష్ణానది పక్కనే ఉన్నా, నీటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నా గుంటూరుకు ఎందుకు నీరు అందించలేకపోతున్నారు? ఈ అసమర్ధ పాలనలో రాజధాని లేదు, ఒక పరిశ్రమ లేదు, ఇక విద్యార్థులకు ఉపాధి ఎక్కడ నుంచి వస్తుంది? మళ్లీ లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. వాలంటీర్ల పేరుతో రూ. 3-5 వేలు ఇచ్చినంత మాత్రాన ప్రజల కడుపు నిండుతుందా? ఉపాధి అంటే నెలకు రూ. 30-40 వేలు దాకా సంపాదించుకోగలిగే అవకాశాలు కల్పించాలి. నా శక్తి మేరకు ప్రజలకు మేలు చేస్తానే తప్ప ఎవరి కష్టాన్ని దోచుకోవాల్సిన పని లేదు. నసీర్ అహ్మద్: ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచకపోగా, పేదల వ్యతిరేక ప్రభుత్వంగా మార్చిన నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా అరాచక పాలన చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. సంక్షేమం పేరిట పేదల జేబులకు చిల్లు పెట్టారు. ఈ పర్యటనలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నేరెళ్ల సురేష్ కుమార్, నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్, బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర వర్మ, 51వ డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి, ముస్లిం నాయకుడు సయ్యద్ ముజీబ్ తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.”
Tags: No Categories
Party Joinings
April 27, 2024    

Party Joinings

టిడిపిలోకి వరుస చేరికలు.తూర్పులో వైసీపీకి నాయకుల గుడ్ బై.పెమ్మసాని ఆధ్వర్యంలో 350 మంది చేరిక. గుంటూరు:ఒక్క రూపాయి అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర చరిత్రలో చెట్లు నరికిన నాయకుడు ఎవరైనా ఉంటే అది జగనే.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గుంటూరులోని తూర్పు నియోజకవర్గంలో గల 6, 57 డివిజన్లలోని సుమారు 350 మంది వైసీపీ కార్యకర్తలు టిడిపిలో శనివారం చేరారు. పార్టీలో చేరుతున్న వారిని పెమ్మసాని చంద్రశేఖర్ గారు టిడిపి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో గుంటూరు పేరును ఇండియా మొత్తం వినపడేలా చేస్తాను అని అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయిన వైసీపీ ప్రభుత్వం పై ఆయన విమర్శలు గుప్పించారు. గంజాయి, గుట్కాలు అమ్ముకున్న ఎమ్మెల్యే బాగుపడ్డారని, ప్రజలు మాత్రం ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక రెండు సెంట్లలో ఇళ్ల నిర్మాణం లేదా టిట్కో ఇల్ల అందజేత ద్వారా పేదలకు నివాస సౌకర్యం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నిరుద్యోగ సమస్యను తరిమికొట్టే విధంగా ఇండస్ట్రీలు తెస్తామని, ఇంటి నుంచి బయటకు రాలేని మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అలాగే నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ వైసీపీకి ఐదేళ్ళుగా క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు కూడా ఆ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నారని, అందువల్లే టిడిపిలో చేరుతున్నారని వివరించారు. స్థానిక ప్రజలకు రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టిడిపి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. టిడిపి నాయకులు భరత్ రెడ్డి, ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు నంబూరు సుభాని, రావి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
Madam Door to Door Campaign
April 27, 2024    

Madam Door to Door Campaign

Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 27, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Pedhanandhipadu Road Show
April 26, 2024    

Pedhanandhipadu Road Show

జగన్ ప్రచార పిచ్చికి చెల్లు చీటీ. + పార్లమెంటుకు వెళ్ళింది మొదలు గుంటూరు పేరే వినిపిస్తుంది. + పెదనందిపాడు మండలం పర్యటనలో పెమ్మసాని. ‘ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల పొలాల్లో పునాదిరాళ్లపైన జగన్ ఫోటోలను అతికించుకున్నారు. ఎవరి ఆస్తుల్లో ఎవరి ఫోటోలు అతికించుకుంటారు? ఇదేనా ప్రజా సంక్షేమం?’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి చంద్రశేఖర్ గారు ప్రశ్నించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం లోని పెదనందిపాడు మండల పర్యటనలో భాగంగా నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని గారు శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా నాగభైరవ పాలెం, జరుగు వారి పాలెం, ఉప్పలపాడు, పరిటాల వారి పాలెం, అన్నవరం, రాజుపాలెం, పాలపర్రు, అభినయని గుంట పాలెం, గిరిజవోలు గుంట పాలెం, గోగులమూడి, కాట్రపాడు, కుసులూరు గ్రామాల్లో ఆ ఇరువురు నాయకులు పర్యటించారు. కాగా ఈ సందర్భంగా పలు గ్రామాలు ప్రజలు మాట్లాడుతూ గ్రామాల్లోని పలు అంతర్గత, గ్రామాల్లోకి రాకపోకలు సాగించే రహదారులు ఇబ్బందికరంగా మారాయని, నీటి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రజల వినతులు సావధానంగా విన్న తర్వాత పెమ్మసాని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల సహకారంతో వచ్చిన జలజీవన్ మిషన్ నిధులను ఈ జగన్ కేవలం కడపకి మాత్రమే తరలించుకున్నారని విమర్శించారు. టిడిపి అధికారంలోకి రాగానే నివాసాలకు కులాయి కనెక్షన్లు వచ్చేలా కృషి చేస్తామని, నకిలీ విత్తనాలు ఎరువులు మార్కెట్లోకి రాకుండా అరికడతామని తెలిపారు. అలాగే రైతుల ప్రోత్సాహకాల నిమిత్తం పసుపు, మిర్చి, టొమాటో ఇతర పంటల అభివృద్ధికి సహకరిస్తామని భరోసా ఇచ్చారు. సిఎస్ఆర్ రాజ్యసభ నిధులతో అభివృద్ధికి పునాది వేస్తానని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు సులభతరమయ్యేలా స్కిల్ డెవలప్మెంట్ కు, అవసరమైతే సొంత ఖర్చులతో అందిస్తానని ఈ సందర్భంగా పెమ్మసాని స్పష్టం చేశారు. అలాగే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ప్రతి గ్రామాన ఉన్న సమస్యలను గుర్తించామని చెప్పారు. తాము ఎక్కడ ఎక్కడైతే పర్యటనలు చేస్తున్నామో, ఆయా గ్రామాలన్నింటిలోనూ వైసీపీ ఖాళీ అవుతుందన్నారు. అయినా కొందరు కార్యకర్తలు వైసిపి కోసం తిరుగుతున్నారని, మునిగిపోయే పడవలో తిరగటం అనవసరమని ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి రామాంజనేయులు మాట్లాడారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ మాట్లాడుతూ వైసీపీ అరాచకాలతో విసుగు చెంది, వ్యతిరేకంగా ఉన్న మాలాంటి ఎందరో నాయకులు ప్రజాక్షేమం గురించి ఆలోచించే టిడిపి వైపు చూస్తున్నారన్నారు. అభివృద్ధి జరగాలంటే టిడిపి తరఫున పోటీ చేస్తున్న ఎంపీగా పెమ్మసానిని, ఎమ్మెల్యేగా బూర్ల రామాంజనేయులు మెజారిటీతో గెలిపించాలని జగన్ విధ్వంసక పాలనకు చరమగీతం పాడాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విన్నవించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య, ముస్లిం నాయకులు సయ్యద్ ముజీబ్, ఉగ్గిరాల సీతారామయ్య తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories
Madam Door to Door Campaign at Tenali
April 26, 2024    

Madam Door to Door Campaign at Tenali

Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 26, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
BC Meeting
April 26, 2024    

BC Meeting

*ఎన్డీఏ కూటమికే మా మద్దతు*. + పెమ్మసాని సమక్షంలో విలేకరులతో బీసీ సంఘం నాయకుల ప్రకటన. ‘గడిచిన ఐదేళ్ళుగా బీసీలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు చేయడమే ఈ ప్రభుత్వం చేయంగా మారింది. బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్ డి ఏ కూటమితోనే సాధ్యం. బీసీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి ఈ సీఎం చోద్యం చూస్తున్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ హక్కు చట్టం టీడీపీతోనే సాధ్యం.’ అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేశన శంకర్రావు, గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర రావు గారు మాట్లాడారు. గుంటూరులోని అమరావతి రోడ్డులో గల స్వగృహ కన్వెన్షన్లో బీసీ రాష్ట్ర సంక్షేమ సంఘం ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ విలేకరుల సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులతోపాటు పెమ్మసాని చంద్రశేఖర్ గారు విలేకరులతో మాట్లాడారు. *బిసి నాయకులు కేశన శంకర్రావు*. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సంక్షేమ సంఘం నాయకులు నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాతే ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించాం. గడిచిన ఐదేళ్ల నుంచి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వలన ప్రజా జీవనం, ప్రజాస్వామ్యం అస్తవ్యస్తంగా మారింది. సీఎం కేవలం బటన్ నొక్కడానికి మాత్రమే పరిమితమయ్యారు. మహిళల పట్ల మానభంగాలు, బీసీలపై హత్యలు, వేధింపులు, హింసలు అరాచక పాలన పెచ్చు మీరిపోయింది. బీసీలకు ప్రత్యేక రక్షణ హక్కు చట్టం కల్పిస్తామని ప్రకటించిన తర్వాత టిడిపి పై బీసీలకు నమ్మకం పెరిగింది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజా సంక్షేమం దృష్ట్యా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించాల్సిన అవసరం ఉంది. బీసీ సామాజి వర్గానికి చెందిన పలువురు ఐఏఎస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు నిజాయితీగా పని చేశారన్న ఒకే ఒక కారణంతో ఈ ప్రభుత్వం పోస్టింగ్ లు ఇవ్వకుండా వేదిస్తోంది. రాష్ట్రం పారిశ్రామికంగా ఎదగాలన్నా, యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నా ఎన్డీఏ కూటమి విజయం సాధించాల్సి ఉంది. *పెమ్మసాని చంద్రశేఖర్ గారు* 2019లో జగన్ చెప్పిన మాటలు విని బీసీలలో అన్ని వర్గాలు ఆయనకు ఓట్లు వేశాయి. కానీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అన్యాయం చేశారు. 16 యూనివర్సిటీలలో వైస్ ఛాన్సెలర్ అవకాశాలు ఉంటే కేవలం ఒక పోస్ట్ మాత్రమే బీసీలకు ఇచ్చారు. జగన్ దృష్టిలో నవరత్నాలు తప్పించి మరో అభివృద్ధి, సంక్షేమం గురించి ఆయనకు పట్టదు. టిడిపి మాత్రమే ఒక ఎర్రన్నాయుడుగారిని, దేవేందర్ గౌడ్, కే.ఈ కృష్ణమూర్తి లాంటి ఎంతోమంది నాయకులను తయారు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది. మా ప్రభుత్వం వచ్చాక ఇసుక పాలసీపై తగు నిర్ణయం బాబు గారి నేతృత్వంలో తీసుకుంటుంది. బీసీ సంఘాల నాయకులందరూ మళ్ళీ వెనక్కి వచ్చి ఎన్డీయే కూటమికి మద్దతు ఇవ్వడం ఎంతో సంతోషించకరమైన అంశం. *పిడుగురాళ్ల మాధవి* గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సాధికారత అంతకన్నా లేదు. బీసీల వెన్నుదన్నుగా పుట్టిన టిడిపికి ఈరోజు మళ్లీ బీసీ నాయకుల మద్దతు ఉండటం ఆనందించదగ్గ విషయం. బీసీలను కులాలవారీగా విభజించిన కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఈ వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుంది. బీసీలకు కంచుకోట వంటి పశ్చిమ నియోజకవర్గంలో నాకు టిడిపి అవకాశం కల్పించింది. మీ అందరి మద్దతుతో పశ్చిమ నియోజకవర్గం లో టిడిపి జెండా రెపరెప ఆడాలి. *మహమ్మద్ నశీర్ అహ్మద్*: రాజ్యాధికారం కోసం బీసీలు పోరాటాలు చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఎన్టీఆర్ ఆనాటి రాజకీయాల నుంచి బీసీలకు అవకాశాలు కల్పించారు. అదే ఒరవడిని కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు కూడా బీసీలకు పదవుల శాతాన్ని పెంచారు. కానీ నేటి జగన్ ప్రభుత్వం బీసీలకు పదవులను, రాజ్యాధికారాన్ని దూరం చేసే విధంగా పాలన చేస్తుంది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అవకాశాలు ఇవ్వాల్సి ఉన్నా, ఆ పదవులనుంటిని జగన్ తన సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఇవ్వడం గమనార్హం. ఈ పక్షపాత వైఖరిని ప్రతి ఒక్క బీసీ నాయకులు గుర్తించాలనే విన్నవించుకుంటున్నాను. బీసీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్ళించిన జగన్ తిరిగి బీసీలకు ఏదో ఉద్ధరించానని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. *రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన అధ్యక్షుడు క్రాంతి కుమార్* బీసీ రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్ రావు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని, గడిచిన మే 14వ తేదీన చంద్రబాబు నాయుడి సమక్షంలో స్పష్టత ఇచ్చాం. ఈ వైసీపీ పెద్దలు బీసీలకు సంబంధించిన 56 కార్పొరేషన్లలో బీసీలకు నాయకత్వం అవకాశాలు కల్పించారా? లేదా? వైసీపీలో ఉన్న బీసీ నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ప్రజా సంక్షేమం గురించి గానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి గానీ, ఏ రోజైనా బయటకు వచ్చి ప్రశ్నించారా? ఈ రాష్ట్రంలో బీసీల్లోని 90 శాతం ఉన్న భవన నిర్మాణ కార్మికుల గురించి ఏ రోజైనా ఈ ప్రభుత్వం పట్టించుకుందా? బీసీల హక్కుల కోసం మేము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. ఈరోజు బీసీ ప్రత్యేక హక్కు చట్టం టిడిపి పెట్టిన తర్వాత వైసిపి కూడా ఇస్తానని చెప్పొచ్చు. మేనిఫెస్టోలో చేర్చవచ్చు. కానీ, ఈ ఐదేళ్లలో బీసీల కోసం ఏం చేశారు? అని ప్రశ్నిస్తున్నాను. రజకులపై ఎన్నో అత్యాచారాలు, హింసలు, వేధింపులకు పాల్పడ్డ వైసిపి ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు నాగమల్లేశ్వరరావు, నిమ్మల శేషయ్య, బాతుగున్నల శ్రీనివాసరావు, మల్లె ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
4 5 6 7 8 9 10 11 12 13 14 15