Swasthisala Pradhana
క్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం. + క్రీస్తు బోధనల స్వస్తిశాల ప్రార్థనల్లో పెమ్మసాని ‘ఏసుక్రీస్తు బోధనలు మానవ మనుగడకు మార్గదర్శకం. ఏసు బోధించిన శాంతి మార్గాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. పెదకాకానిలో జరుగుతున్న క్రీస్తు స్వస్తిశాల ప్రార్థనల కార్యక్రమంలో పెమ్మసాని సోమవారం పాల్గొన్నారు. కార్యక్రమంలో సంబంధిత పాస్టర్ల నుంచి పెమసాని ఆశీర్వాదం అందుకున్నారు. ప్రజా సంక్షేమం కోరే వ్యక్తులకు ఆ ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ అందజేస్తారని, సాటి మనుషుల మేలు కోసం ప్రయత్నించే నాయకులకు ఎప్పుడు మంచే జరుగుతుందని ఈ సందర్భంగా పాస్టర్లు తెలియజేశారు. ఈ ప్రార్ధన కార్యక్రమంలో ఆయనతోపాటు పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, తాడికొండ నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
Tadikonda Road Show
అహంకారం అసలు పేరు జగన్. + మాకున్నది నీతి నిజాయితీతో కూడిన ధైర్యం + ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల ఆస్తులను స్వాహా చేసే ప్రయత్నం. + టిడిపి అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం + మేడికొండూరు మండల పర్యటనలో పెమ్మసాని ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలంలో సోమవారం పర్యటించారు. తాడికొండ నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి పెమ్మసాని గారు మండలంలోని కొర్రపాడు, విశదల, మందపాడు, సిరిపురం, వరగాని గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: నాకు, పవన్ కళ్యాణ్ గారికి అహంకారం ఎక్కువ అని కొందరు వైసిపి నాయకులు మాట్లాడుతున్నారు. అహంకారం అంటే జగన్ ది బ్రదర్! మాది నీతి, నిజాయితీతో కూడిన మనస్తత్వం నుంచి పుట్టిన ధైర్యం. దానికి ఈ వైసీపీ నాయకులు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. రెండు, మూడు రోజులుగా ఏపీకి మూడు రాజధానులు కావాలని ఒక రాజధాని వద్దని కిలారు రోశయ్య మాట్లాడుతున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో పక్కా లోకల్ అని చెప్పుకుని తిరుగుతున్న రోశయ్యను ఒకటే అడుగుతున్నా, పక్కా లోకల్ అంటే లోకల్ గా ఉన్న రాజధానిని కనిపించకుండా చేయడమేనా? అని ప్రశ్నిస్తున్నాను. నేనైనా, రోశయ్య గారైనా ప్రజలకు ఏం కావాలో అదే చేయాలి తప్ప, ఎవరో ఏదో చెప్తే చేసేయకూడదు. రాజధాని ఇక్కడ ఉండకూడదు అని బలంగా చెప్తున్న రోశయ్య గురించి తుది తీర్పు ప్రజలే నిర్ణయిస్తారు. * దేశవ్యాప్తంగా నిరుద్యోగం అనేది 16% ఉంటే ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే 24 శాతం కు చేరింది. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రాకపోయినా, పరిశ్రమలు రాకపోయినా, తాగునీరు అందించకపోయిన పర్లేదు అనుకుంటేనే వైసీపీకి ఓటేయండి. రాబోయేది టిడిపి ప్రభుత్వం. వైసీపీకి వేసే ఓట్లు మురిగిపోతాయే తప్ప ఉపయోగం ఉండదని ప్రజలు గుర్తుంచుకోవాలి. స్థానికంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు ఇతర సౌలభ్యాలు లేకుండా ఏ పరిశ్రమ కూడా ఏపీలో స్థాపనకు ముందుకు రాదు. పూర్తి సౌకర్యాలు కల్పిస్తూ అమెరికా వంటి ఇతర దేశాల్లో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో పూర్తిస్థాయిలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తాం. మారు మాట్లాడితే సింహం.. సింహం.. అని చెప్పుకునే జగన్ జనసేన గుర్తు అయిన గాజు గ్లాసు కు మారుగా మరో గ్లాసు గుర్తు ద్వారా ఒక వ్యక్తిని పోటీకి దించుతున్నారు. ఎవరికివారు తమ స్వయంకృపరాధాన్ని గుర్తించి తప్పు తెలుసుకోవడం మంచిది. కానీ పక్షంలో కాలమే సమాధానం చెబుతుంది. ల్యాండ్ టైటిలింగ్ పేరుతో వైసీపీ నాయకులే వివాదాల సృష్టించి వాళ్లే పరిష్కరించినట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. 140 సీట్లతో టీడీపీ మెజార్టీ సీట్లతో అధికారంలోకి రాబోతుంది. శ్రావణ్ కుమార్ గారు: ల్యాండ్ టైటిల్ అనేది ప్రజల భూములను వారికి కాకుండా చేస్తే భూతం లాంటిది. ప్రజల ఆసులను ప్రజలకు దూరం చేయాలని ఎత్తుగాడుతోని వైసిపి ఈ యాక్టును తీసుకొస్తుంది. ప్రజలు ఊకొమ్మడిగా వ్యతిరేకించిన నాడే ఇలాంటి అరాచక పాలనకు ఫుల్ స్టాప్ పెట్టగలం.
Brahmana Atmiya Samavesam
బ్రాహ్మణులకు అండగా ఉంటాం + బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని గుంటూరులోని స్థానిక గ్రంధి సీతారామయ్య కళ్యాణమండపంలో ఆదివారం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ ఆత్మీయ సదస్సు కార్యక్రమానికి గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి చంద్రశేఖర్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఈ సందర్భంగా పలువురు బ్రాహ్మణ నాయకులు మాట్లాడుతూ బ్రాహ్మణ కార్పొరేషన్ ను తిరిగి ఏర్పాటు చేయాలని పెమ్మసాని, మాధవి, నసీర్ ను కోరారు. మూడేళ్లు వేద అభ్యాసం చేసుకునే బ్రాహ్మణ విద్యార్థులకు కల్పిస్తానని లోకేష్ గారు చెప్పారని తెలిపారు. బ్రాహ్మణ విద్యార్థులను విదేశాలకు పంపించిన ఘనత టిడిపిదేనని, బ్రాహ్మణులు, విద్యార్థులను ఈ జగన్ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేసిందని వివరించారు. అలాగే బ్రాహ్మణ భవన్ ను నిర్మింప చేసేలా చర్యలు తీసుకోవాలని, బ్రాహ్మణుల తరఫున తాము అడుగుతున్న ఈ పది డిమాండ్లను నెరవేర్చాలని ఈ సమావేశంలో పెమ్మసానిని పలువురు బ్రాహ్మణ నాయకులు కోరారు. అనంతరం పెమసాని మాట్లాడుతూ…. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: చీమకు కూడా హాని చేయని బ్రాహ్మణులపై అధికారపు మత్తుతో జగన్ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులు ఎవరైనా దేవాలయం, దేవున్ని ముట్టుకోవాలంటేనే భయపడతారు, కానీ ఈ ప్రభుత్వం దేవుళ్లను, దేవాలయాలను భ్రష్టు పట్టిస్తోందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిందే కాబట్టి తిరిగి దానిని అమలు చేయడం గాని, నిధులను కేటాయించడం వంటివి టిడిపి ప్రభుత్వం రాగానే కచ్చితంగా చేపట్టేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవులను కేటాయించేలా చేస్తామని తెలిపారు. సామాన్యులు మొదలు పేదవాళ్ల వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనది ఇల్లు అని, పేదల నివాసార్థం టిడిపి ప్రభుత్వం నిర్మాణం చేయించిందని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా బ్రాహ్మణులకు నా సాయశక్తులా కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నాయకులు ఏపీఎంఐడిసి మాజీ చైర్మన్ రంగా వజ్జుల లక్ష్మీపతి, బిజెపి నాయకులు జూపూడి రంగరాజు, టిడిపి బ్రాహ్మణ సాధికార సంస్థ అధ్యక్షుడు బుచ్చి రామ ప్రసాద్, పెమ్మసాని రవిశంకర్, గల్లా రామచంద్రరావు పాల్గొన్నారు.
Guntur West Road Show
మీ ఆస్తుల చిట్కా ప్రజలకు కూడా చెప్పండి. + విడుదల రజిని అఫీడవిట్ పై పెమ్మసాని చురకలు. + హాస్టల్, కళ్యాణ మండపం బాధ్యత మాది : పెమ్మసాని + ముస్లింలు మొదలు సామాన్యుల నుంచి విడుదల రజిని అక్రమ వసూళ్లు – మల్లెల రాజేష్ నాయుడు. ‘ఎలాగూ ఓడిపోతారు, ఏ నియోజకవర్గమైతే ఏంటన్నట్టు రజనీని గుంటూరుకు పంపారు. రజిని దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తులకు, ఆదాయానికి సంబంధం లేదు. ఆ చిట్కా ఏదో పేద ప్రజలకు కూడా చెప్తే వాళ్ళు కూడా కోటీశ్వరులు అవుతారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, పశ్చిమ నియోజకవర్గ టిడిపి సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 18,19,20,22 డివిజన్లో పెమ్మసానితో పాటు పలువురు టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం ఆదివారం నిర్వహించారు. పర్యటనలో భాగంగా వీధి వీధినా ప్రజలను కలుసుకుంటూ వారి స్థానిక సమస్యలను పెమ్మసాని అడిగి తెలుసుకున్నారు. మూడు, నాలుగు దశాబ్దాలకు పైగా స్థానికంగా నివసిస్తున్న తమకు ఇళ్ల పట్టాలు లేవని, నీటి, డ్రైనేజీ సమస్యలను ఎన్నిసార్లు అధికారులకు చెబుతున్నా పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు పెమ్మసానికి ఏకరువు పెట్టారు. సమస్యలను సావధానంగా విన్న తర్వాత పెమ్మసాని మాట్లాడుతూ నియోజకవర్గంలోని స్థానికుల సమస్యలను ఒక్కొక్కటిగా టిడిపి ప్రభుత్వం రాగానే పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు. ఇంటి పట్టా సమస్యలు కోర్టులో ఉన్నట్టు తెలిసిందని పరిష్కరించే అవకాశాన్ని బట్టి తప్పకుండా ప్రజలకు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన హాస్టల్, కళ్యాణ మండపం నిర్మాణ బాధ్యతలు తాము చూసుకుంటామన్నారు. పిల్లలకు విద్య ద్వారానే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని, పేదరికం నుంచి బయటపడే ఏకైక ఆయుధం చదువు ఒకటేనని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు. అలాగే పశ్చిమ వైసిపి అభ్యర్థిని విడుదల రజిని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇటీవలే సమర్పించిన అఫిడవిట్ గురించి ప్రస్తావిస్తూ ఆమె తన అఫిడవిట్లో అందజేసిన వివరాల ప్రకారం 2019కి ముందు ఆదాయం లేదని, అనంతరం రూ. 25 లక్షల ఆదాయం ఉన్నట్లు చూపించారని వివరించారు. అయితే ఆస్తులు మాత్రం రూ. 18.79 కోట్లు ఉన్నట్లుగా చూపించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఆస్తుల చిట్కా ఏంటో చెబితే ప్రజలందరూ కోటీశ్వరులు అవుతారు కదా! అని ఆయన చమత్కరించారు. ఎన్నికల అధికారులైనా ఒకసారి ఆ అఫిడవిట్ ను పరిశీలిస్తే బాగుండేదని ఆయన కోరారు. చిలకలూరిపేటలో చేసిన అవినీతి నుంచి తప్పించుకునేందుకు గుంటూరుకు వచ్చారని, ఇక్కడ కూడా అదే అవినీతిని కొనసాగిస్తే ఆ భారం మొత్తం ప్రజలపైనే పడుతుందని ఆయన పేర్కొన్నారు. టిడిపి వల్లే సంక్షేమం సాధ్యం – పిడుగురాళ్ల మాధవి నిజమైన సంక్షేమం ఎలా ఉంటుందో టిడిపి ద్వారా తెలుస్తుంది. టిడిపికి ఓటు వేస్తే పథకాలు రద్దు చేస్తాం, పట్టాలు రద్దు చేస్తామంటూ బెదిరించే వాళ్ళకి చెంపపెట్టులా మీ ఓటుతో సమాధానం చెప్పండి. జగన్ చేసిన అప్పులకు ఇకమీదట అభివృద్ధి చేయలేరు. చేసిన అప్పులు తీర్చాలంటే మళ్లీ మళ్లీ అప్పులు చేయాల్సిందే. పోర్టులు సంక్షేమం అభివృద్ధి అనేది టిడిపి వల్లే సాధ్యం. ప్రభుత్వానికి స్థలాలు అప్పజెప్పి మంత్రి పదవి దక్కించుకున్నారు – మల్లెల రాజేష్ నాయుడు. ఎలాగూ ఓడిపోతారనే నమ్మకంతో, ఎక్కడైతే ఏంటి అనుకుని రజినిని జగన్ గుంటూరు పంపించారు. నాలుగు నెలలుగా మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని గుంటూరులో హడావిడి చేస్తున్నారు. ప్రశాంతంగా ఉండే చిలకలూరిపేటలో నాలుగున్నరెళ్ళుగా రజని కుటుంబం చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. ముస్లింలకు ఖబర్ స్థాన్ కోసం రెండు ఎకరాలు కేటాయిస్తానని చెప్పి రూ. కోటిన్నర తీసుకుని ముప్పు తిప్పలు పెట్టారు. ఆమె మరిది, భర్త కలిసి ఏయే రూపాల్లో డబ్బు వస్తుందో వెతకడమే పనిగా పెట్టుకుంటారు. ఇక గుంటూరు విషయానికి వస్తే ప్రజలపై రజనీ టాక్స్ వేయడానికి ఆమె సిద్ధంగా ఉంది. కాంట్రాక్టర్లు కమిషన్లు ఇవ్వలేదని ఎన్నో పనులు ఆపించిన ఘనత రజనిదే. ఈ పర్యటనలో సత్తెనపల్లి అసెంబ్లీ బిజెపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, మైనారిటీ నాయకులు సయ్యద్ ముజీబ్, జిల్లా బిజెపి అధ్యక్షుడు వనమా నరేంద్ర వర్మ, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస యాదవ్, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, జనసేన జిల్లా వైస్ ప్రెసిడెంట్ అడపా మాణిక్యం తదితర టిడిపి, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.
Para Medical staff meeting
మెడికల్ ఇన్సూరెన్స్ కు కృషి చేస్తాం. + గుంటూరులో ఖచ్చితమైన మార్పు చూస్తారు. + పారా మెడికల్ సిబ్బంది ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని. ‘పారా మెడికల్ సిబ్బందికి ప్రధాన సమస్యగా ఉన్న మెడికల్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తాం. సిబ్బందికి జీతాల పైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. నగరంలోని ఏ కన్వెన్షన్ లో ఆదివారం జరిగిన పారామెడికల్ సిబ్బంది ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు. ఆయనతోపాటు పశ్చిమ నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, తూర్పు నియోజకవర్గం అభ్యర్థి నసీర్ అహ్మద్ కూడా పాల్గొన్నారు. కాగా సమావేశంలో భాగంగా పలువురు సిబ్బంది పెమ్మసానితో మాట్లాడుతూ మెడికల్ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఉద్యోగుల్లో అభద్రతాభావం ఏర్పడిందన్నారు. ఏదేని ప్రమాదం ఎదురైనా భద్రత లేని జీవితాలు గడుపుతున్నామని వాపోయారు. సిబ్బంది సమస్యలను తెలుసుకున్న తర్వాత పెమ్మసాని గారు మాట్లాడుతూ కరోనా సమయములో కన్న బిడ్డల్ని సైతం వదిలి వైద్యం అందించిన వైద్య సిబ్బందికి వందనాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్యులు, సిబ్బంది పైన దాడులు బాగా పెరిగాయని, భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. వీటన్నిటికంటే ముఖ్యంగా గుంటూరు నగరంలో గంజాయి, మత్తు మందులు పెరగడం వలన పిల్లల భవిష్యత్తులో సర్వనాశనం అయ్యే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని గుర్తు చేశారు. ఉద్యోగాలకు వెళ్లి రాత్రి వరకు పనిచేసే వచ్చే తల్లిదండ్రులకు పిల్లలు ఎటు వెళ్తున్నారు? ఏం చేస్తున్నారో? అన్న భయంతో గడపాల్సిన పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. అనంతరం మాట్లాడిన పిడుగురాళ్ల మాధవి పారా మెడికల్ సిబ్బంది అంటేనే కనిపించని హీరోలు అన్నారు. అవినీతి రహిత సమాజం కావాలంటే డెడికేషన్ తో పనిచేసే నాయకులు కావాలని తెలిపారు. ఓటు అడగడానికి వచ్చిన నాయకులను మీకే ఎందుకు ఓటేయాలని ఓటర్లు ప్రశ్నించిన నాడే నాయకుల్లో చలనం కలుగుతుందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎటు చూసినా ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు లేవు, ధరలు పెరిగాయి, ఆదాయాలు మాత్రం శూన్యంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ సంక్షేమం చేశామని వైసిపి ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం చోద్యంగా ఉందని వివరించారు. డా. శ్రీవిద్య సభాధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, మైనారిటీ నాయకులు సయ్యద్ ముజీబ్, టిడిపి నగర డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Break Fast with Totha Saibabu Garu
“నేనైతే జగన్ మొహాన కొట్టేవాడిని. + మూడు రాజధానులు కావాలన్న రోశయ్య పై పెమ్మసాని ఫైర్. గుంటూరు: ‘700 ఎకరాల గ్రావెల్ తవ్విన రోశయ్య అక్రమ సంపాదనను వెనకేసుకున్నారు. అందుకే జగన్ చెప్పినట్టల్లా ఆడుతున్నారు. మూడు రాజధానులు కావాలని జగన్ చెప్పమంటే మాత్రం చెప్పేస్తారా? ప్రజల గురించి ఆలోచించేది లేదా? అదే నేనైతే రాజీనామా చేసి జగన్ మొహాన కొట్టి వచ్చేవాడిని.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. గుంటూరులోని స్థానిక 38వ డివిజన్లోని బృందావన్ గార్డెన్స్ టెంపుల్ రోడ్డులో వేములపల్లి విఠల్ ఆధ్వర్యంలో,
మాజీ రిటైర్డ్ మున్సిపోల్ కమిషనర్ దేవినేని కరుణచంద్రబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులే కావాలని ఒక రాజధాని వద్దు అని ప్రకటించిన పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోగా ఉన్న రాజధానిని కూడా నాశనం చేశారని ఫైర్ అయ్యారు. అక్రమ మైనింగ్ ద్వారా రూ. 2,300 కోట్లు అవినీతి చేశారు కాబట్టే, జగన్ చెప్పినదానికల్లా తల ఊపుతున్నారని విమర్శించారు. అందుకే ఎంపీగా ఓడిపోతారని తెలిసినా సరే గత్యంతరం లేక రోశయ్య పోటీ చేస్తున్నారని అన్నారు. అదే రోశయ్య స్థానంలో తాను ఉండి ఉంటే పదవికి రాజీనామా చేసి, జగన్ మొహాన విసిరి వచ్చేవాడినని, ఆయన కాబట్టి చేతులు కట్టుకుని ఉన్నారని తెలిపారు. అలాగే గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న రజనీ గారు ఒక సిస్టమాటిక్ గా అవినీతి చేస్తున్నారని, అందుకే చిలకలూరిపేట ప్రజలు వద్దన్నా వద్దనుకున్నారని వివరించారు. అందువల్లే ఓటమి భయం కొద్దీ గుంటూరు వచ్చి ఆమె చేరారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు, దేశాలకు వలస పోవాల్సిన అవసరం వస్తుందని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో పార్లమెంట్, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమలను తీసుకురావాలంటే ఒక కఠోర శ్రమ అవసరమని సొంత నేలపై, పుట్టిన భూమిపై ప్రేమ ఉన్నవారికి మాత్రమే ఆ ప్రయత్నం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ ఈ అరాచక ప్రభుత్వాన్ని అరికట్టాలంటే ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి కృషి చేయాలని చెప్పారు. చెప్తే వినే వాళ్లను మాత్రమే గాక మిగతా వారికి కూడా ఓటు ప్రాధాన్యత, జగన్ ప్రభుత్వ అరాచకం గురించి వివరించాలని కోరారు. స్థానికంగా పొలిటికల్ సిస్టం నాలెడ్జ్ గురించి అవగాహన లేక ఏర్పడ్డ గ్యాప్ ను సవరించడానికి అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల హరి, స్థానిక నాయకులు విఠల్రావు, కార్పొరేటర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.”
మాజీ రిటైర్డ్ మున్సిపోల్ కమిషనర్ దేవినేని కరుణచంద్రబాబు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశానికి పెమ్మసాని గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రాజధానులే కావాలని ఒక రాజధాని వద్దు అని ప్రకటించిన పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోశయ్యపై పెమ్మసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోగా ఉన్న రాజధానిని కూడా నాశనం చేశారని ఫైర్ అయ్యారు. అక్రమ మైనింగ్ ద్వారా రూ. 2,300 కోట్లు అవినీతి చేశారు కాబట్టే, జగన్ చెప్పినదానికల్లా తల ఊపుతున్నారని విమర్శించారు. అందుకే ఎంపీగా ఓడిపోతారని తెలిసినా సరే గత్యంతరం లేక రోశయ్య పోటీ చేస్తున్నారని అన్నారు. అదే రోశయ్య స్థానంలో తాను ఉండి ఉంటే పదవికి రాజీనామా చేసి, జగన్ మొహాన విసిరి వచ్చేవాడినని, ఆయన కాబట్టి చేతులు కట్టుకుని ఉన్నారని తెలిపారు. అలాగే గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న రజనీ గారు ఒక సిస్టమాటిక్ గా అవినీతి చేస్తున్నారని, అందుకే చిలకలూరిపేట ప్రజలు వద్దన్నా వద్దనుకున్నారని వివరించారు. అందువల్లే ఓటమి భయం కొద్దీ గుంటూరు వచ్చి ఆమె చేరారని విమర్శించారు. రాష్ట్రంలో విద్యార్థులకు, యువతకు ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు, దేశాలకు వలస పోవాల్సిన అవసరం వస్తుందని తెలిపారు. టిడిపి అధికారంలోకి వచ్చాక అమెరికాలో స్థిరపడ్డ ప్రవాస ఆంధ్రుల సహకారంతో పార్లమెంట్, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమలను తీసుకురావాలంటే ఒక కఠోర శ్రమ అవసరమని సొంత నేలపై, పుట్టిన భూమిపై ప్రేమ ఉన్నవారికి మాత్రమే ఆ ప్రయత్నం సాధ్యమవుతుందని ఆయన వివరించారు. అలాగే పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ ఈ అరాచక ప్రభుత్వాన్ని అరికట్టాలంటే ప్రజలందరూ ఏకతాటిపై నిలిచి కృషి చేయాలని చెప్పారు. చెప్తే వినే వాళ్లను మాత్రమే గాక మిగతా వారికి కూడా ఓటు ప్రాధాన్యత, జగన్ ప్రభుత్వ అరాచకం గురించి వివరించాలని కోరారు. స్థానికంగా పొలిటికల్ సిస్టం నాలెడ్జ్ గురించి అవగాహన లేక ఏర్పడ్డ గ్యాప్ ను సవరించడానికి అందరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆళ్ల హరి, స్థానిక నాయకులు విఠల్రావు, కార్పొరేటర్ పద్మ, తదితరులు పాల్గొన్నారు.”