Kollipara Road Show
పెమ్మసాని చంద్రశేఖర్ గారు: మేము ఒకప్పుడు తినడానికి లేక ఇబ్బంది పడ్డామని కొందరు ఏదేదో చెప్తున్నారు. అవును, మేము అప్పటి మాకున్న హోటల్లో కష్టపడి పని చేసాం. ఆ కష్టమే మాకు ఇప్పటికీ అలవాటయింది. ఒకప్పుడు మా హోటల్లో సర్వర్ లేకపోతే ప్లేట్లు కూడా తీశాం బ్రదర్! అందులో చెప్పుకోడానికి ఏమాత్రం వెనకాడబోను, ధైర్యంగా చెప్పుకోగలం. మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్లం. * శత్రువు ఎదురొచ్చినా సరే నవ్వుతూ ఉండాలి, అప్పుడే ఆరోగ్యానికి మంచిది. సమాజాన్ని ముందుకు తీసుకెల్లేలా అభిమానం ఉండాలి. మన చుట్టూ ఉండే వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఆ అభిమానం ఉండాలి. నలుగురికి కీడు చేసేది, ఉన్న ఉద్యోగాలు పాడు చేసేది, రాజధాని ప్రాంతాన్ని నాశనం చేసే అభిమానం ఎవరికైనా మంచిది కాదు. ఒక కియా సంస్థను తీసుకురావడానికి చంద్రబాబు ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కియా సంస్థ ద్వారా కొన్ని వందల ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అలా చంద్రబాబు ద్వారా ఏర్పడ్డ ఎన్నో సంస్థలు నేడు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితికి వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చింది. * వైసీపీ హయాంలో మద్యం ధర అంత భారీ స్థాయికి చేరడానికి కారణాలేంటి? ద్రవ్యోల్బణంలో ఎంత మార్పు వచ్చినా ఒకేసారి రూ. 100-200లు మార్పు ఎందుకు వస్తుంది? జగన్ మళ్ళీ గెలిస్తే ఆ మద్యం ధర రూ.500 కు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎన్నికల్లో ఆయన పెట్టే ఖర్చు మొత్తం ప్రజల నుంచే మళ్లీ వసూలు చేస్తారు. ఒకప్పుడు ఎన్నారైలు ఈ చుట్టు పక్కల స్థలాలు, పొలాలు కొనుక్కునేవారు. ఇవాళ ఏ ఒక్కరూ కొనుక్కునే పరిస్థితి లేదు, కనీసం తమ సొంత ప్రాంతమైన ఏపీకి రావాలన్న ఆసక్తి కూడా తగ్గిపోయింది. మనకే ఇక్కడ స్థలాలు కొనుక్కునే ఆసక్తి లేకపోతే, బయట నుంచి వచ్చే వ్యక్తులు ఎలా కొంటారు అనేది ఆలోచించాలి. * 2014కు ముందు పరిస్థితులు తారు మారూ అయి ఒకసారి రాజధాని మారింది. ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, రాజధాని ఏర్పడ్డాక ఆ రాజధానిని మళ్లీ మళ్లీ ఎలా మారుస్తారు? అమరావతిని రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా అంగీకరించిన జగన్, మళ్ళీ రాజధాని ఎలా మార్చాలని ప్రయత్నిస్తున్నారు? నాదెండ్ల మనోహర్ గారు: ఒకప్పుడు కొల్లిపర మండలం తెనాలి నియోజకవర్గం లోని నెంబర్ వన్ గా ఉండేది. ప్రజలకు ప్రశాంతమైన జీవితం అందించాలని ప్రయత్నాలు చేశాం. ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు జరిగిన నష్టాన్ని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రభుత్వం ఖర్చు పెట్టిన రూ. రూ. 100 లలో రూ. 4 లు మాత్రమే అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు. ఒక ట్యూబ్ లైట్ మార్చాలన్నా పంచాయతీల్లో నేడు నిధులు లేవు. సైడ్ కాలువల నిర్మాణానికి కూడా నిధులు లేని పరిస్థితిలో పంచాయతీలు కొట్టుమిట్టాడుతున్నాయి. మన గురించి కాదు, మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి ఈసారి ఓటేద్దాం. ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్నది నేను, పెమ్మసాని కలిసి పక్కా ప్రణాళిక ద్వారా మీ ముందుకు వస్తాం.
Ratna Apartment Meeting
Rajakulla Atmiaya Samamvesam
బీసీలకు అండగా ఉంటాం – పెమ్మసాని.తెనాలిలో జరిగిన బీసీ సమావేశం. తెనాలిలోని రాధాకృష్ణ కళ్యాణ.మండపంలో గురువారం జయహో బిసి కార్యక్రమం జరిగింది. తెనాలి నియోజకవర్గ నాయకులతోపాటు గ్రామ మండల స్థాయి టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రజకులు: బీసీలను గాని, రజకులను గాని ప్రారంభం నుంచి ప్రోత్సహించింది టిడిపినేనని, నేడు టిడిపి తో కలిసిన జనసేనకు కూడా తాము అండగా ఉంటామని బీసీ నాయకులు తెలిపారు. తమలో ఒకరైన రజకుల జీవనోపాధి కోసం చెరువులు పూడికలు తీసి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. అయితే నేటి సాంకేతిక విధానాన్ని ఉపయోగించి జీవన ఉపాధి ఉపయోగపడేలా మిషనరీ అందించి సహకరించాలి అని కోరారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు: నందమూరి తారక రామారావు గారూ పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఎన్ని సార్లు ఎలక్షన్లు వచ్చినా, ఎన్ని పార్టీలు వచ్చినా బీసీలు, రజకులు అందరూ టిడిపికి అండగా ఉన్నారు. శుభ్రంగా ఉండి, ఇస్త్రీ చేసిన దుస్తులు వేసుకోవడం అంటే నాకు ఇష్టం. కానీ అమెరికాలో అంత శుభ్రంగా ఐరన్ చేసి ఇచ్చే వ్యక్తులు లేరు. ఇప్పుడు అదే విషయాన్ని కొందరు సోదరులు మిషనరీ ఉపయోగించి పనిచేయాలన్న ఆలోచనలను నాకు చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక వ్యక్తికి తన పనిపై శ్రద్ధ, భక్తి ఉన్నప్పుడే కొత్తదనంతో కూడిన ఆలోచనలు వస్తాయి. జగన్ తన పాలనలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రులను ప్రకటించారు. కానీ ఆ పదవుల్లో ఉన్న ఏ ఒక్క నాయకుడు వల్ల అయినా ప్రజలకు ఉపయోగం జరిగిందా? ఆ నాయకులు జగన్ దగ్గరికి వెళ్తే కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా ఉండదు. ఎవరికి కుర్చీ వేయాలో, వేయకూడదు అనేది జగన్ తన కనుసైగల ద్వారా నిర్ణయిస్తారట! వైసీపీలో అయోధ్య రామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి వంటి వారిని తప్ప చెప్పుకోదగ్గ ఒక్క బీసీ నాయకుడిని కూడా ఆ పార్టీ తయారు చేయలేకపోయింది. తల్లిదండ్రులు ఒక వృత్తిలో ఉన్నంత మాత్రాన తరతరాలు అదే వృత్తిని అనుసరించాలని ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి విద్య అనేది చైతన్యవంతులను చేయగల సాధనంగా ఉంటుంది. నేను కూడా చదువుకోగలిగాను కాబట్టే ఈ స్థాయికి చేరుకోగలిగాను. చంద్రబాబు గారి హయాంలో రాజధాని ప్రాంతంలో మూడు అద్భుతమైన యూనివర్సిటీలు తీసుకొచ్చారు. చక్కని భవనాలు, సౌకర్యాలు, విద్యను బోధించే ఫ్యాకల్టీని అందించండి, యూనివర్సిటీకి కావలసిన సకల సౌకర్యాలు తాము అందిస్తామని బాబు గారు హామీ ఇచ్చిన తర్వాతే యూనివర్సిటీలు రాజధానికి వచ్చాయి. మరి ఐదేళ్లు గడుస్తున్నా సరే జగన్ సీఎం గా ఉండి కూడా కొత్త యూనివర్సిటీలు, పరిశ్రమలు తేలేకపోయారు. కనీసం ఉన్న సంస్థలు ఉన్నత స్థితికి చేరుకోగలిగేలా సౌకర్యాలు కల్పించలేకపోయారు. ఇలాంటి విచ్ఛిన్న రాజకీయాల చేసే జగన్ లాంటి నాయకులు ఉన్నప్పుడు ప్రశ్నించడానికి, నిలదీయడానికి ఒక పెమ్మసాని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మనోహర్ వంటి నాయకులు వస్తూనే ఉంటారు. నాదెండ్ల మనోహర్: నారా చంద్రబాబునాయుడు గారు కానీ అంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇతర నాయకులు కానీ తీసుకున్న నిర్ణయాలు ప్రజల మేలు కోసం తీసుకున్నవే. ప్రజల జీవన విధానంలో, ఆర్థిక విధానంలో మార్పు తీసుకురావడానికి చేసిన నిర్ణయాలు. బలహీనవర్గాల కోసం పోరాడిన నాయకులు ఎందరో తెనాలిలో ఉన్నారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చే ఇతర నాయకుల్లా కాకుండా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి సమిష్టిగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో కార్యక్రమాలను తీసుకురాబోతున్నారు. టిడిపి హయాంలో ఉండగా బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి పాటుపడింది కానీ, జగన్ ప్రభుత్వం కులాలవారీగా కార్పొరేషన్ లు విడగొట్టి కులాల మధ్యన చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసింది.