Kapu Communtiy Meeting
జగన్ కు బొమ్మ కనపడాలి + ఎవరి ఆస్తులపై ఎవరు బొమ్మలు, ఫోటోలు వేసుకుంటారు. + జగన్ వస్తే పెట్రోలు, నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతాయి. + ఫేక్ స్పెషలిస్ట్ జగన్ – పెమ్మసాని ‘తాతలు, తండ్రులు ఇచ్చిన ఆస్తులపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. కానీ పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించి మరి ఇవ్వడం వెనక ఆంతర్యం ఏమిటి? చివరకు సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ వేయించుకున్నారు ఎక్కడబడితే అక్కడ బొమ్మలు వేయించుకున్న జగన్ కు రేపు ఎన్నికల్లో ప్రజలకు పెద్ద బొమ్మ వేస్తారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బోర్ల రామాంజనేయులు గారితో కలిసి పెమ్మసాని శుక్రవారం పర్యటన నిర్వహించారు. పర్యటనలో భాగంగా 16 గ్రామాల్లో ఇరువురు నాయకులు ప్రచారం నిర్వహించారు. పర్యటన నిర్వహించిన ప్రతి గ్రామంలోని మహిళలు, వృద్ధులు, యువకులు ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు. గ్రామ గ్రామాన భారీ గజమాలతో ఆహ్వానం పలుకుతూ సత్కరించారు. పరిటాల లో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ… ఈ ప్రభుత్వం అమలు చేయబోతున్న ల్యాండ్ యాక్టింగ్ చట్టం ప్రకారం త్వరలో ప్రజల భూములన్నీ తనవే అని జగన్ లాక్కున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మునిగిపోయే పడవలాంటి వైసిపికి వేసే ఓటు మురిగిపోబోతుంది. దయచేసి అందరూ సహకరిస్తే పార్టీలకు అతీతంగా అందరికీ లబ్ధి చేకూరేలా చూసే బాధ్యత టిడిపి తీసుకుంటుంది. ఫేక్ న్యూస్ జగన్ నన్ను ఏమీ అనలేక, ఏం చేయాలో తెలియక ఈ వైసీపీలో ప్రభుత్వం ఫేక్ న్యూస్ ఉదంతాలకు తిరిగి తెరతీసింది. మహా న్యూస్, ఈటీవీ తదితర ఛానల్స్ లో మేమేదో చేసినట్టుగా, మాట్లాడినట్టుగా భ్రమింప చేసేలా కొన్ని ఫేక్ వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇంతకుమించి ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ ఇంకేం చేయగలరు? నీతి నిజాయితీ కలవ వాళ్లు ఇలాంటి చీప్ ట్రిక్స్ కు బెదరరు. ఐదేళ్ల నుంచి భరిస్తున్న ప్రజలకు ఒకటే విన్నవిస్తున్నా, ఒక్క వారం రోజులు ఆగండి ఈ అరాచక ప్రభుత్వానికి చరమగీతం పాడదాం. * మీ బిడ్డల భవిష్యత్తు రాజధాని నిర్మాణం అనంతరం ఉద్యోగాల కల్పనా బాధ్యతలు మేము తీసుకుంటాం. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కిలారు రోశయ్య ఇప్పటికే మూడు ముక్కలాటకు అంగీకారం తెలిపారు. అమరావతి ప్రాంతంలో నివసిస్తూ, రాజధానిగా అమరావతినే వద్దని, మూడు రాజధానులే కావాలని రోశయ్య మాట్లాడుతుండటం చోద్యంగా ఉంది. అలాగే రైతులకు మూడు పంటలకు సరిపడా సాగునీరు అందించేలా కృషి చేస్తాం. రైతులకు ఉపయోగపడేలా ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలి. ఒకటే చెప్పదలుచుకున్నా, కర్మ కాలి మళ్లీ జగన్ రావడం అంటూ జరిగితే పెట్రోల్ ధరలు రూ. 125 రూపాయలు, మద్యం ధరలు రూ. 200, నిత్యావసర సరుకుల ధరలు రూ.5 వేలు దాటిపోతాయి బ్రదర్! సమస్య మన వరకు రాలేదు కదా అని కూర్చుంటే, కూర్చున్న చాప కిందకే సమస్యలు తెచ్చి పెడతారు జాగ్రత్త!నష్టపోవద్దండి – బూర్ల రామాంజనేయులు. ఆ జగన్ 123 సార్లు బటన్ నొక్కారట! మరి రూ. 200ల కరెంట్ బిల్ రూ. 2 వేలు అయింది, రూ. 60 రూపాయల లిక్కర్ బాటిల్ రూ.200కు అయింది. మరి దీనికి ఎవరు బటన్ నొక్కారు జగన్? మా ప్రజలు కూడా రెండుసార్లు బటన్ నొక్కితే చాలు జగన్ కనపడకుండా వెళ్ళిపోతావు. ఇంత అరాచక పాలన చేస్తున్న జగన్కు ఓటు వేసి నష్టపోవద్దండి.