Events

Dr Pemmasani's Public Programs
April 8, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Iftar Vindh in Tenali
April 7, 2024    

Iftar Vindh in Tenali

ఇఫ్తార్ విందులో డా. పెమ్మసాని. + పాల్గొన్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్, శాసన మండలి మాజీ చైర్మన్ ఎండీ షరీఫ్.\n\nనూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ముస్లిమ్ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్.\n\n\n* ముందుగా ముస్లిమ్ సోదరులతో కలిసి దువా లో పాల్గొని ప్రతీక ప్రార్థనలు చేసిన రాజా, పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్.\n\nపెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిమ్ సోదరులు\nపెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ\n\nరంజాన్ సందర్భంగా ముస్లిమ్ సొదరులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు \nపేదల ఆకలి బాధలు అందరికీ తెలియ చేసే విధంగా రంజాన్ సంప్రదాయం ప్రవక్త ఆదేశాలతో ఏర్పడింది.\nఓపిక సహనం పెంచేదే రంజాన్ పండుగ గొప్పతనమే. ఈ ఎన్నికల చలవకొద్ది వీలైనంత ఎక్కువమంది ముస్లింలను కలుస్తూ ఉండటం చాలా సంతోషకరం. \n\nమి అందరితో కలిసి భోజనం చేయటం చాలా ఆనందంగా ఉంది\n\nచంద్రబాబు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో అబ్దుల్ కలామ్ నీ రాష్ట్రపతి నీ చేసిన టీడీపీ బిజెపి నీ గౌరవించాలనీ\n\nముస్లిమ్ సోదరులు చాలా తెలివిగలవారు మి ఓటు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి మీ ఓటు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ——————— మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ -\n\nముస్లింల సంక్షేమానికి అభ్యర్థికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ \n\nతెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపునిస్తు వారి అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.\n\nహజ్ యాత్రకు వెళ్ళటానికి, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చేసింది.\n\nరాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీది.\n\nపవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు విశేష సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని’ అన్నారు. \n\nముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతృప్తికరంగా ఉందనీ\n\nఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో మొదటి స్థానం నిలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని \n \nరాష్ట్ర అభివృద్ధి భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదరులు రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని తెలిపారు. పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ -\n\nరంజాన్ సందర్భంగా ముస్లిమ్ సోదరులకు ధన్యవాదాలుముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని\n\nమీ అభివృద్ధికి స్వేచ్ఛకి అన్ని విధాల మీకు రాబోయే ఉమ్మడి ప్రభుత్వం అండగా ఉంటుందని \n\nగతంలో మిరు ఇక్కడ ఎలా ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ముందు ఉంటామనీమీ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు ఇఫ్తార్ విందులో డా. పెమ్మసాని. + పాల్గొన్న మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జనసేన పీఏసీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్, శాసన మండలి మాజీ చైర్మన్ ఎండీ షరీఫ్.
నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ముస్లిమ్ సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్.
* ముందుగా ముస్లిమ్ సోదరులతో కలిసి దువా లో పాల్గొని ప్రతీక ప్రార్థనలు చేసిన రాజా, పెమ్మసాని చంద్రశేఖర్, మనోహర్.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిమ్ సోదరులు
పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ
రంజాన్ సందర్భంగా ముస్లిమ్ సొదరులందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు
పేదల ఆకలి బాధలు అందరికీ తెలియ చేసే విధంగా రంజాన్ సంప్రదాయం ప్రవక్త ఆదేశాలతో ఏర్పడింది.
ఓపిక సహనం పెంచేదే రంజాన్ పండుగ గొప్పతనమే. ఈ ఎన్నికల చలవకొద్ది వీలైనంత ఎక్కువమంది ముస్లింలను కలుస్తూ ఉండటం చాలా సంతోషకరం.
మి అందరితో కలిసి భోజనం చేయటం చాలా ఆనందంగా ఉంది
చంద్రబాబు బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో అబ్దుల్ కలామ్ నీ రాష్ట్రపతి నీ చేసిన టీడీపీ బిజెపి నీ గౌరవించాలనీ
ముస్లిమ్ సోదరులు చాలా తెలివిగలవారు మి ఓటు రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి మీ ఓటు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.- మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ –
ముస్లింల సంక్షేమానికి అభ్యర్థికి కృషి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపునిస్తు వారి అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది.
హజ్ యాత్రకు వెళ్ళటానికి, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడడానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చేసింది.
రాష్ట్రంలోని ముస్లిం మైనార్టీలను సామాజికంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలుగుదేశం పార్టీది.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లిం సోదరులు విశేష సంఖ్యలో పాల్గొనడం సంతోషకరమని’ అన్నారు.
ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతృప్తికరంగా ఉందనీ
ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల్లో మొదటి స్థానం నిలిపిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని
రాష్ట్ర అభివృద్ధి భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముస్లిం సోదరులు రానున్న ఎన్నికల్లో ఓటు వేయాలని తెలిపారు.
పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ –
రంజాన్ సందర్భంగా ముస్లిమ్ సోదరులకు ధన్యవాదాలు
ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషాన్నిచ్చిందని
మీ అభివృద్ధికి స్వేచ్ఛకి అన్ని విధాల మీకు రాబోయే ఉమ్మడి ప్రభుత్వం అండగా ఉంటుందని
గతంలో మిరు ఇక్కడ ఎలా ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రశాంత వాతావరణంలో ఉండే విధంగా ముందు ఉంటామనీ
మీ అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు
Guntur West Internal Meeting
April 7, 2024    

Guntur West Internal Meeting

విజయమే లక్ష్యంగా పనిచేయాలి. + పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలతో డాక్టర్ పెమ్మసాని. ‘విజయమే లక్ష్యంగా 26 డివిజన్లలోనూ టిడిపి కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయాలి. పనిచేయకుండా ఫలితం ఎవరికీ దక్కదు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత మాది.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. గుంటూరులోని స్థానిక టిడిపి పార్లమెంటరీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తల, నాయకుల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఏయే డివిజన్లలో ఏ కార్యకర్త, ఏ స్థాయిలో కష్టపడ్డారు అన్నది తాను స్వయంగా తెలుసుకుంటానని, పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా తనకు, ఎమ్మెల్యేగా పిడుగురాళ్ల మాధవికి మెజారిటీ వచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రచార కార్యక్రమాల్లో, అధికారులతో, ఇతరత్రా సమస్యలు ఏమున్నా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. అలాగే స్థానికంగా డివిజన్లో ఏ చిన్నపాటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పెమ్మసాని వివరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం టిడిపి అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, పశ్చిమ నియోజకవర్గం నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు (నాని), కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 7, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Rachabanda in Kunchanapallin village Along with Nara Lokesh
April 6, 2024    

Rachabanda in Kunchanapallin village Along with Nara Lokesh

“గతంలో ఇచ్చిన హామీలపై ఆర్కేని నిలదీయండి!మంగళగిరి సొంతమనుకుని సేవచేస్తున్నా…ఆశీర్వదించండి.భూసేకరణ చేసి శ్మశాన వాటికలకు స్థలాలు కేటాయిస్తాం.మంగళగిరి నియోజకవర్గ రచ్చబండ సభల్లో నారా లోకేష్, డా. పెమ్మసాని.
కరకట్ట కమలాసన్ గా పేరొందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే… నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు ఇవ్వలేదని, ఇళ్లపట్టాలు ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని రెండునెలల క్రితం చెప్పాడు. మళ్లీ ఇప్పుడు వచ్చి నాటకాలు ఆడుతున్నారు. మీ వద్దకు వచ్చినపుడు గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజలంతా ఆర్కేని నిలదీయాలని యువనేత నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు, నూతక్కి, కుంచనపల్లిలో జరిగిన రచ్చబండ సభలకు యువనేత హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… గత ఎన్నికల్లో ఓడిపోయిన రోజునుంచే మంగళగిరి నా సొంతమనుకుని సేవలందిస్తున్నా. అయిదేళ్లుగా సొంతనిధులతో 29సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను. 4ట్యాంకర్లు పెట్టి తాగునీరు అందించాను, వర్షంపడి రోడ్లుపాడైతే సొంతడబ్బుతో గ్రావెల్ వేశాను. అధికారంలో లేకపోయినా యుద్ధ ప్రాతిపదికన సమస్యలు పరిష్కరించాను. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు గుండెలమీద చేయివేసుకుని ఆలోచించండి. 25ఏళ్లుగా ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నికైన వారు నేను చేసిన పనుల్లో పదోవంతు అయినా చేశారా? గత ప్రభుత్వ హయాంలో రేవేంద్రపాడు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయిస్తే, వైసిపి అధికారంలోకి వచ్చాక నిలిపివేశారు. అయిదేళ్లుగా కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఈ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడం వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉంది. 2నెలల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక రేవేంద్రపాడు బ్రిడ్జి నిర్మిస్తా. జగన్ అధికారంలోకి రాష్ట్రానికి గుంతల రోడ్ల పథకాన్ని ప్రవేశపెట్టారు. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ఆర్కే ఏం చెప్పారు? ఇళ్లు లేని వారందరికీ ఇళ్లపట్టాలు ఇప్పిస్తానని చెప్పి ఒక్కరికైనా పట్టా ఇచ్చారా? నియోజకవర్గంలో డ్రైనేజి సమస్య తీవ్రంగా ఉంది. అధికారంలోకి వచ్చాక అండర్ గ్రౌండ్ డ్రైనేజి చేపడతాం. పక్కనే కృష్ణానది ఉన్నా ఇక్కడి ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడటం విచారకరం. కృష్ణానది నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికీ కుళాయి అందించే బాధ్యత నాది. జగన్ అధికారంలోకి వచ్చాక కరెంటు ఛార్జీలు, ఆర్టీసి ఛార్జీలు, ఇంటిపన్ను, చెత్తపన్ను అంటూ రకరకాలపై ప్రజలపై భారాలు మోపారు. యువగళం పేరుతో కుప్పం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. వాటన్నింటినీ పరిశీలించాక చంద్రబాబు, పవనన్న సూపర్-6 హామీలను ప్రకటించారు. లక్షలు ఖర్చుపెట్టి చదివించిన బిడ్డలకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే మా ప్రథమ ప్రాధాన్యత, పరిశ్రమలు రప్పించి అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలిస్తాం. సంక్షేమం, అభివృద్ధి సైకిల్ కు రెండు చక్రాలు. పనిచేయడానికి మంగళగిరి నియోజకవర్గానికి వచ్చా. దేశంలోనే మంగళగిరిని అభివృద్ధికి చిరునామాగా మారుస్తా. మీ ఇంటిబిడ్డలా భావించి రాబోయే ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించండి, అత్యధిక మెజారిటీతో గెలిపించి సేవచేసే అవకాశం కల్పించాలని లోకేష్ కోరారు.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు:2019లో జగన్ ను చూసి వైయస్సార్ కొడుకు, ఓదార్పు యాత్ర చేస్తున్నాడు అని నమ్మి ప్రజలు 151 సీట్లతో గెలిపించారు. గెలిచిన తర్వాత 30 ఏళ్ల ప్రజాభిమానం సంపాదించాల్సిన జగన్ ప్రజలను వేధిస్తున్నారు. బుద్ధి, జ్ఞానం ఉన్న ఏ నాయకుడు కూడా ప్రజల కష్టం, చెమటతో నిర్మించిన ప్రజా వేదికను కూల్చడానికి ఇష్టపడరు. ప్రజల కోసం తన జీవితాన్ని ధార పోసిన చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయించిన జగన్ తన వికృత పాలనను మరోసారి చూపించారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన అయోధ్య రామిరెడ్డికి బాబు గారు అప్పట్లో పలు బాధ్యతలు అప్పగించారు. వేస్ట్ మేనేజ్మెంట్, ఐ.టి అభివృద్ధి బాధ్యతలు అప్పగిస్తే అందులో అవినీతి చేసిన అయోధ్య రామి రెడ్డి ఇవాళ మంగళగిరిలో అరాచక రాజ్యమేలుతున్నారు. అయోధ్యరామిరెడ్డిని, ఆర్కెను ఒకటే అడుగుతున్నాను.. ఈ ఐదేళ్లలో నియోజకవర్గంలో ఒక తట్ట మట్టి అయినా ఎత్తారా? కనీసం ఒక రోడ్డుకు ప్యాచ్ వర్క్ అయినా పూర్తి చేశారా? పార్లమెంటు పరిధిలో ఒక కాపు సోదరుడిని బెదిరించి, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని హెచ్చరించి మరీ వైసీపీ బరిలోకి దింపుతుంది. తనకు ఇష్టం లేదు మహాప్రభో అని ఆ వ్యక్తి మొత్తుకున్నా, ఈ జగన్ బలవంతంగా పోటీ చేయిస్తున్నారు.
లోకేష్ దృష్టికి రేవేంద్రపాడు, నూతక్కి గ్రామస్తుల సమస్యలు
దుగ్గిరాల మండలం రేవేంద్రపాడులో నిర్వహించిన రచ్చబండ సభలో గ్రామస్తులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజి, తాగునీటి సౌకర్యం కల్పించాలి. ఇళ్లులేని వారికి ఇంటిపట్టాలు ఇప్పించాలి. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రుల్లో వైద్యం అందించడం లేదు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో పెన్షన్ ను నిలిపివేస్తున్నారు. రోడ్డువిస్తరణలో మసీదు పోయేలా ఉంది. ముస్లింలకు మసీదు, కమ్యూనిటీ హాలు, ఖబరస్థాన్ ఏర్పాటుచేయాలి. 80లక్షలు మంజూరయ్యాయని చెప్పిన ఎమ్మెల్యే ఆర్కే 80రూపాయలు కూడా ఇవ్వలేదు. దళితులకు శ్మశానవాటిక లేదు. రేవేంద్రపాడు పొలిమేరల్లో పొలాలకు వెళ్లే పుంతరోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరారు. నూతక్కి ప్రజలు తమ సమస్యలు చెబుతూ మురుగునీరు పంటకాల్వల్లోకి వస్తుంది, డ్రైన్ల నిర్మాణం చేపట్టాలి. లంకభూములకు పట్టాలిచ్చి, వరదల బారినుంచి కాపాడాలి. ఇంటర్ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలి. ఇసుక కొరత వల్ల పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. కుంటిసాకులతో పెన్షన్లలో కోతలు విధిస్తున్నారని చెప్పారు. లోకేష్ స్పందిస్తూ… ఇళ్లులేనివారికి ఇళ్లపట్టాలతోపాటు ఇళ్లు నిర్మించి ఇస్తాం. సిసిరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. పంటకాల్వలకు లాకులు ఏర్పాటు చేస్తాం. శ్మశానవాటికల సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉంది. భూసేకరణ చేసి జనాభా దామాషా ప్రాతిపదికన శ్మశానాలకు స్థలాలను కేటాయిస్తాం. అధికారంలోకి వచ్చాక ముస్లింలకు మసీదు, కమ్యూనిటీ హాలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం. మైనారిటీ కార్పొరేషన్ కు నిధులు కేటాయించి బలోపేతం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.”
Guntur East internal meeting
April 6, 2024    

Guntur East internal meeting

టిడిపి విజయానికి కృషి చేస్తాం. + తూర్పు నియోజకవర్గం అంతర్గత సమావేశంలో పెమ్మసానితో కార్యకర్తలు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపికి విజయం దక్కేలా కష్టించి పనిచేస్తామని గుంటూరు తూర్పు నియోజకవర్గం టిడిపి నాయకులు కార్యకర్తలు చెప్పారు. గుంటూరులోని టిడిపి పార్లమెంటరీ కార్యాలయంలో గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ అంతర్గత సమావేశం శనివారం జరిగింది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని డివిజన్ల నాయకులతో డాక్టర్ పెమ్మసాని నసీర్ అహ్మద్ మాట్లాడారు. కాగా స్థానిక, సంస్థాగత సమస్యలపై ఈ సమావేశంలో పెమ్మసాని చర్చించారు. క్లస్టర్ బూతు డివిజన్ స్థాయి నాయకులు కష్టించి పనిచేయాలని ఎన్నికల్లో టిడిపి విజయం చారిత్రాత్మకం కాబోతుందని పెమ్మసాని తెలిపారు. అయితే డివిజన్లో ఉన్న చిన్నపాటి సమస్యలను పెమ్మసాని దృష్టికి తీసుకెళ్లగా, ఆయన పరిష్కరించారు. దీంతో డివిజన్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్, టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, తదితర నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Tags: No Categories
Guntur chamber of commerce Meeting
April 6, 2024    

Guntur chamber of commerce Meeting

వ్యాపారస్తుల సమస్యల పరిష్కరిస్తాం. + చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులతో డాక్టర్ పెమ్మసాని ‘చాలామంది నాయకులు రాజకీయాల్లో పెట్టిన ఖర్చును ఎన్నికల తర్వాత వ్యాపారస్తులపై మోపుతుంటారు. మాకు అలాంటి అవసరం లేదు. చిన్నచిన్న వ్యాపారులు పడే ఇబ్బందులకు పరిష్కారం చూపిస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో శనివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ అయితే వ్యాపారస్తులు లేదా సహజ వనరులే లక్ష్యంగా కొందరు రాజకీయ నాయకులు దండుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరూ ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ వన్ టౌన్ లో ప్రశాంతంగా జీవించే వ్యాపారస్తుల ఆస్తులను కొందరు నాయకులు కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఒక చేతకాని దద్దమ్మ పాలనలో గుంటూరు ప్రజల అవస్థలు పడుతున్నారు అన్నారు. పెమ్మసాని గారి అడుగుజాడల్లో నడుస్తూ పెద్దవారికి తమ్ముడిగా చిన్నవారికి అనగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ అందరి సమస్యలను తన సమస్యలుగా భావించి పరిష్కరిస్తాను అని చెప్పారు. రాజకీయాల్లో తానేమి సంపాదించాలని ఉద్దేశంతో రాలేదని సేవ చేయాలని ఉద్దేశంతో వచ్చానని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, 35వ డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్(బాబు), గుంటూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ఆతుకూరి ఆంజనేయులు, మిర్చి మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, తదితరులు పాల్గొన్నారు.
Vsiting District BJP Leader Vanam Naredra House
April 6, 2024    

Vsiting District BJP Leader Vanam Naredra House

వనమా ఇంటికి పెమ్మసాని. బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరస్వతీ శిశు మందిర్ జిల్లా అధ్యక్షులు వనమా పూర్ణచంద్రరావు నివాసానికి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు శనివారం వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి మొదలు నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు రాజకీయ విశేషాలను పెమ్మసానికి వనమా వివరించారు. ఆనాటి ఉద్యమ కాలంలో పోరాటం చేసినందుకుగాను 12 రోజులు తిహారు జైల్లో ఉంచిన విషయాన్ని ఈ సందర్భంగా వనమా వివరించి చెప్పారు. బిజెపి కూడా ఎన్నో ప్రజా రంజక పథకాలను మోదీ నాయకత్వంలో అమలు అవుతున్నాయని ఈ సందర్భంగా పెమ్మసాని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్, వనమా తనయులు బిజెపి జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 6, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Signature Studio Interview
April 6, 2024    

Signature Studio Interview