Events

Dr Pemmasani's Public Programs
April 18, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Madam Door to Door Campain
April 18, 2024    

Madam Door to Door Campain

Tags: No Categories
Naarigalam-mahila samavesam
April 17, 2024    

Naarigalam-mahila samavesam

నామినేషన్ రోజే ఎలక్షన్ అయిపోవాలి. + మహిళల భద్రత నిమిత్తం పొలిటికల్ సెన్సార్ బోర్డ్. + పెమ్మసాని ఊపిరి ఉన్నంతవరకు అమరావతిని టచ్ చేయలేరు. + ‘నారీ గళం’ సమావేశంలో పెమ్మసాని ‘మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన ఘనత రాజకీయ అవకాశాలు కల్పించిన ఎన్టీఆర్ ది. అలాంటి మహిళలకు రాజకీయంగా భద్రత కల్పించాలంటే పొలిటికల్ సెన్సార్ బోర్డ్ ఉండాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గుంటూరులోని స్థానిక సిద్ధార్థ గార్డెన్స్ లో బుధవారం జరిగిన ‘నారీ గళం’ సమావేశానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని గారు సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్, చంద్రబాబు మహిళల ఉన్నతికి కృషి చేశారని, అలాంటి నాయకుల తర్వాత వచ్చిన జగన్ మహిళలపై కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని అన్నారు. మహిళలు రాజకీయంగా ఎదగాలని చెబుతూ చదువు, విజ్ఞానం ఉన్నప్పటికీ రాజకీయ శక్తిగా మహిళలను ఉన్నత స్థాయికి చేర్చడానికి సహకరిస్తుందని పేర్కొన్నారు. అందుకుగాను పార్లమెంట్ సాక్షిగా తన సహకారం తాను అందిస్తానని ఆయన చెప్పారు. రాజకీయంగా సోషల్ మీడియాకు ఒక సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసినప్పుడే మహిళలు ధైర్యంగా రాజకీయాల్లోకి రాగలరు అని పెమ్మసాని తెలిపారు. ఈ పెమ్మసాని ఊపిరి ఉన్నంతవరకు అమరావతిని గాని ఏపీని గాని ఎవరూ టచ్ చేయలేరని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. కాగా కార్యక్రమంలో భాగంగా బిజెపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ నారీ గళం సమావేశం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మహిళలు చురుకైన పాత్ర పోషించాలన్నారు. అన్ని వర్గాలకు, మతాలకు న్యాయం జరిగేలా చూడాలంటే కూటమి ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. మోదీ ఆధ్వర్యంలో భారతదేశ మూడవ అతి పెద్ద ఆర్థిక దేశంగా ఎదిగిందని చెప్పారు. అభివృద్ధిని పరుగులు పెట్టించే చంద్రబాబు నాయుడు వంటి నాయకుడు, ప్రజా సమస్యలను ప్రశ్నించేందుకే ఆవిర్భవించిన జనసేన కలిసి ప్రయాణిస్తున్న ఈ కూటమికి ప్రజలు సహకరించి ఎన్నికల్లో విజయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, మహిళా టిడిపి నాయకురాలు మాగంటి రూప, డాక్టర్ శ్రీ రత్న తదితర టిడిపి జనసేన బిజెపి మహిళా నాయకులు పాల్గొన్నారు.
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 17, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
GSR School Sri Ramanavami event
April 17, 2024    

GSR School Sri Ramanavami event

Tags: No Categories
Amaravathi Visuals
April 17, 2024    

Amaravathi Visuals

అమరావతి: ప్రత్తిపాడు, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసిపికి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ ఆధ్యర్యంలో 50మంది ప్రస్తుత సర్పంచ్ లు, ఎంపిటిసిలు, మాజీ జడ్ పిటిసిలు, మాజీ కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో వారందరికీ యువనేత నారా లోకేష్ పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కార్యకర్తలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే పార్టీ టిడిపి అని అన్నారు. వారికి ఏ కష్టమొచ్చినా కడుపులో పెట్టుకుని చూసుకుంటామని అన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా వందకోట్లకుపైగా అందించిన ఏకైక పార్టీ టిడిపి మాత్రమేనని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి 70లక్షలమంది పసుపుసైనికులే ఆస్తి అని, తెలుగుజాతి అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తామని అన్నారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా సుభిక్షంగా ఉండాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పసుపుజెండా అంతా ఎగురవేసేందుకు కలసికట్టుగా కృషిచేయాలని కోరారు.
పార్టీలో చేరిన వారిలో ముప్పాళ్ల విశ్వేశ్వరరావు, గింజుపల్లి సుబ్బారావు, కమ్మా నాగమల్లేశ్వరరావు, మదమంచి శ్రీనివాసరావు, యలవర్తి నరసింహరావు, రావిపాటి కృష్ణప్రసాద్, కుర్రా శివనాగేశ్వరరావు, గుంటుపల్లి రవిబాబు, గురజవోలు పద్మావతి, ఘంటా కామేశ్వరరావు, వణుకూరు వీరారెడ్డి, పేరం శ్రీనివాసరావు, మొగిలి భరత్ కుమార్, కొమ్మినేని స్వామి, అరవపల్లి రాంబాబు, ఆరే నరేంద్ర, మద్దినేని శ్రీనివాసరావు, కంచర్ల కోటేశ్వరరావు, నల్లగొర్ల ఓబయ్య, పాటిబండ్ల రాంబాబు, పాగోలు శివకృష్ణ, వేముల శివపార్వతి, పురుషోత్తపట్నం గోకుల్ రావు, దాసరి కుమారస్వామి, అన్నవరపు కృష్ణచైతన్య, షేక్ సుభాని, షేక్ బాషా, షేక్ సూఫియా సుల్తాన్, కొండబోలు బ్రహ్మయ్య, షేక్ మక్బూల్, యామిని శ్రీహరి, ముక్కామల విజయబాబు, బన్నారావూరి శివరామకృష్ణ, షేక్ వాహిదుల్లా, షేక్ మౌలాలి, కంచర్ల మహేష్ పాల్, కటికల చంద్రకుమార్, జొన్నకూటి లక్ష్మీకాంత్, జాస్తి సాంబశివరావు, పిల్లి ప్రసాదరావు, మానుకొండ రవికాంత్, నాగళ్ల శ్రీనివాసరావు, గద్దె కిషోర్, గుండాల ప్రసాద్, సురభి దానయ్య, మోపర్తి శంకర్, రమావత్ హరినాయక్, సందేటి కొండలు, జంగా రాజేష్, కొత్తపల్లి దిలీప్, గూడూరి సాయికృష్ణ, యడ్లపల్లి శేషగిరిరావు తదితరులు ఉన్నారు.
***
పెమ్మసాని ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన కీలకనేతలు!అమరావతి: గుంటూరు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో పలువురు వైసిపి ప్రముఖులు టిడిపిలో చేరారు. ఉండవల్లి నివాసంలో వారికి యువనేత నారా లోకేష్ పసుపుకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వైఎస్సార్ సిపి రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగ కార్యదర్శి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్చార్జి కొలకలూరి కిరణ్, గుంటూరు 17వవార్డు బిసి నాయకుడు బండారు గోపీ యాదవ్, తెనాలి 31వవార్డు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రేపూడి సురేష్ బాబు, 30వవార్డు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు రావూరి అంకమ్మ ఉన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు నూతనంగా చేరిన నేతలు కృషిచేయాలని కోరారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగిన గుర్తింపునిస్తామని చెప్పారు.
**
Ponnur Roadshow
April 16, 2024    

Ponnur Roadshow

పెమ్మసానికి జన నీరాజనం. + పెదకాకాని మండలంలో పెమ్మసాని, ధూళిపాళ్ల పర్యటనకు విశేష ఆదరణ. + గజమాలతో సత్కారాలు, అడుగడుగునా పూల వర్షం + ఇళ్ల నుంచి బయటికి వచ్చి మరీ ప్రజల అభివాదాలు. + పెమ్మసాని పర్యటనకు ఎమ్మార్పీఎస్ నాయకులు మద్దతు. జన ప్రభంజనం. పెదకాకాని మండలం పసుపుమయమైంది. పెమ్మసాని ఆగమనానికి ఉర్రూతలూగింది. రహదారులు కానరాని విధంగా పూల వర్షం కురిపించింది. భవన పై అంతస్థులపై నిలబడి మరీ స్వాగతాంజలి పలికింది. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పెదకాకాని మండలంలోని కొప్పురావూరు, వెనిగండ్ల, పెదకాకాని ప్రాంతాల్లో పొన్నూరు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర గారితో కలిసి గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ గారు మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా తొలి తక్కువ నుంచి ప్రారంభించిన రోడ్ షో పెదకాకాని ముగింపు సభ వరకు దిగ్విజయంగా కొనసాగింది. గ్రామ గ్రామాన ప్రజలు ప్రభంజనంలా కదిలి వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పెమ్మసాని, ధూళిపాళ్ల ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. భవనాల పైనుంచి నిలబడ్డ యువత మహిళలు చిన్నారులు పూల వర్షం కురిపిస్తున్న కురిపిస్తుండగా పెమ్మసాని గారు అభివాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. పెమ్మసాని ప్రచారం ఇలా అంగరంగ వైభవంగా కొనసాగుతుండగా ప్రధాన కూడలికి వచ్చేసరికి ఉన్నట్టుండి విద్యుత్ సరఫరా ఆగిపోయింది. అధికారులను ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దాదాపు అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిచి నిలిచిపోయింది. కాగా అభిమానుల అండ ఉన్న పెమ్మసాని సెల్ఫోన్ లైట్ల వెలుగుల మధ్యనే ఆయన తన ప్రచారాన్ని ముందు కొనసాగించారు. అభిమానులు, కార్యకర్తలు చైతన్య రథానికి చుట్టూ రక్షణ కవచంలా నిలబడి ప్రచార కార్యక్రమం ముందుకు సాగడానికి సహకరించారు. విప్లవ కాంతి నుంచి ప్రజాయాత్ర చేస్తూ వస్తాను – పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ‘విద్యుత్ కట్ చేసినంత మాత్రాన మా ప్రయాణం ఆగదు బ్రదర్! ప్రజా విప్లవ కాంతిలో నుంచి ప్రజాయాత్ర చేసుకుంటూ వస్తాను. నేను మీలాగా మద్యం అమ్మానా? మోసం చేశానా? మైనింగ్ తవ్వేనా? ఎవరికి భయపడాల్సిన అవసరం నాకు లేదు. నా ప్రాంతంలో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి వచ్చాను. నేను సంపాదించిన కరెన్సీకి ఉన్న నిజాయితీ, నీ అవినీతి సొమ్ముకు ఉండదు బ్రదర్! మైనింగ్ లు తవ్వి, అక్రమాలు చేసిన అవినీతి సొమ్ముతో పవన్ కళ్యాణ్ ను ఈ సోకాల్డ్ నాయకులు ఓడిస్తారట! రాసి పెట్టుకోండి ఇప్పుడే చెప్తున్నాను, తలరాత రాసిన బ్రహ్మ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ విజయాన్ని ఆపలేరు. ఈ ప్రభుత్వం ”మద్యం సేవే మాధవసేవ, కోటి విద్యలు క్వార్టర్ కొరకే” అన్న తీరున పనిచేస్తుంది. ఓవైపు చూస్తే నిత్యవసర సరుకుల ధరలు, కరెంటు చార్జీలు, బస్సు చార్జీలు, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇంకోవైపు చూస్తే ఆదాయం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితి నుంచి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితమైన మార్పు తీసుకువస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పేదలకు, నివాసం లేని ప్రజలకు టిట్కో ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత మాది. రూరల్ ప్రాంతాల్లో రెండు, మూడు సెంట్లలో నివాసాలు నిర్మింపజేసి ఇచ్చేలా కృషి చేస్తాం. నియోజవర్గంలో ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి వ్యక్తి కష్టం ధూళిపాళ్ల నరేంద్ర గారికి తెలుసు. అలాంటి వ్యక్తిని ఈ ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయాలని చూసింది. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థిగా నాకు, ఎమ్మెల్యే అభ్యర్థిగా ధూళిపాళ్ల గారికి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను.’ అని పెమ్మసాని గారు ఈ ప్రభుత్వం పనితీరుపై విరుచుకుపడ్డారు. ధూళిపాళ్ల నరేంద్ర గారు. ‘ఈ నియోజకవర్గంలో ఒక్కో వ్యక్తికి ఈ వైసీపీ నాయకులు రూ. లక్ష దాకా అప్పు పడ్డారు. మన సొమ్మును దోచుకు వెళ్లి రేపు ఎన్నికల్లో తిరిగి రూ. 5 వేలు, రూ. 10 వేలు అంటూ ఓట్లు కొనడానికి వస్తారు. దేవాలయాలు, మందిరాలకు వెళ్లి మనస్ఫూర్తిగా దండం పెట్టుకునే మనలాంటి భక్తులకు బదులు హుండీలో చేయి పెట్టే దొంగ, దోపిడి నాయకులు మన ప్రాంతంలో ఉన్నారు. 31 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని మా కుటుంబం నమ్ముకుని ఉంది. రాజధాని నిర్మాణానికి అడ్డుపడ్డ కరకట్ట కమలహాసన్ ప్రజలను మోసం చేశారు. అవినీతి సొమ్ముతో నన్ను నాశనం చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మీ దగ్గర అవినీతి సొమ్ము ఉందేమో! నా దగ్గర ప్రజాభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారం ఈ ప్రాంతంలో జరుగుతున్న అవినీతిని ఎందుకు అడ్డుకోలేకపోయింది? అది అసమర్థతా? చేతకానితనమా? జగన్మోహన్ రెడ్డి దగ్గర టికెట్ తెచ్చుకోవడం చేతకాని నాయకులు పెదకాకానికి వచ్చి తామున్నామని చెప్పి మాట్లాడటం, ప్రజలను ఇంకా మోసపుచ్చటం సిగ్గుచేటు. అలాంటి నాయకుల మాట వింటే మళ్లీ మోసపోవడానికి సిద్ధపడ్డట్టే. ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాగలిగే సత్తా లేని నాయకులు, శివాలయం రోడ్డుని శివాలయం నిధులతోనూ, దర్గా దగ్గరి రోడ్డును దర్గా నిధులతోనూ నిర్మించే స్థితికి చేరారు.’ అని ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడారు. పెమ్మసాని గెలుపు – మాదిగ గెలుపు. పెదకాకాని మండలంలో పర్యటిస్తున్న గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎంఆర్పిఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఆయన వెన్నంటి ఉంటూ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు ఎమ్మార్పీఎస్ గుంటూరు జిల్లా ఇంచార్జ్ కూచిపూడి సత్యం మాదిగ మాట్లాడుతూ ఏపీలో అనేక పార్టీలు పాలన సాగించినప్పటికీ మాదిగల వర్గీకరణకు కృషి చేసింది టిడిపినే అన్నారు. మందకృష్ణ మాదిగ నాయకత్వంలో టిడిపికి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు పెమ్మసాని గెలుపులో మాదిగల పాత్ర కచ్చితంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షుడు మురికిపూడి హృదయ రాజు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకురాలు నంబూరి తబిత మాదిగ, ఎమ్మార్పీఎస్ పొన్నూరు నియోజకవర్గ నాయకులు డేగల బాబు మాదిగ, జాతీయ నాయకురాలు ఆలపాటి కరుణా మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Dr Pemmasani's Public Programs
April 16, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
Guntur West Youth Meeting
April 15, 2024    

Guntur West Youth Meeting

పరిశ్రమల రాకకు ప్రయత్నాలు. నిరుద్యోగ యువత సమావేశంలో పెమ్మసాని. పరిశ్రమలు తీసుకురావడం అంటే పేపర్లపై సంఖ్యలు చదవడం కాదు. పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపాలి, బతిమాలాలి, వాళ్లకు ఒక భరోసా కల్పించాలి.అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. గుంటూరులోని స్థానిక అమరావతి రోడ్డులో గల ఏ వన్ కన్వెన్షన్ హాల్ లో సోమవారం జరిగిన పశ్చిమ నియోజకవర్గం నిరుద్యోగ యువత సమావేశానికి ముఖ్య అతిథిగా పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ లాగా తాడేపల్లి ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తే పరిశ్రమలు రావు అన్నారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్లు కష్టపడి 120 సంస్థలను రాజధానికి తీసుకురావడానికి కృషి చేశారని, స్థలాలు కేటాయించి, జీవోలు కూడా విడుదల చేశారని చెప్పారు. అయితే జగన్ రాగానే సంస్థలను, పరిశ్రమలను రాజధానికి రాకుండా రద్దు చేశారని వివరించారు. అనంతరం తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో యువత తమ సత్తా చాటాలని, తెలుగుదేశం పార్టీ నాయకులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే నిరుద్యోగ భృతిని ప్రకటించిన టిడిపి అధికారంలోకి రాగానే పరిశ్రమలను తీసుకువచ్చి ఉద్యోగ అవకాశాలను అందిస్తుందని తెలిపారు. తిరువీధి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి వడ్రానం హరిబాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చిట్టా బత్తిన చిట్టిబాబు, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మద్దిరాల మ్యాని, జిల్లా అధికార ప్రతినిధి బొబ్బిలి రామారావు తదితరులు పాల్గొన్నారు.
Tags: No Categories
Dr Pemmasani's Public Programs
April 15, 2024    

Dr Pemmasani's Public Programs

Tags: No Categories
7 8 9 10 11 12 13 14 15 16 17 18