Kollipara Road Show
జగన్ మద్యం బాటిళ్ళలో ప్రాణాంతక కెమికల్స్. చక్రాయపాలెం పర్యటనలో పెమ్మసాని.జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న మద్యం బాటిళ్ళలో ప్రాణాంతక కెమికల్స్ ఉన్నాయి. స్వయంగా నేను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయించడం వల్ల అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. కొల్లిపర మండలంలోని జెముడుపాడు, జముడుపాడు పాలెం, చక్రాయపాలెంలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గం కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో పాటు పర్యటించారు. కాగా చక్రాయపాలెంలో స్థానిక నాయకుడు అడపా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సుమారు 100 కుటుంబాలు జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పార్లమెంట్ పరిధిలో తాము పర్యటిస్తున్న ప్రతి చోట వైసీపీ ఖాళీ అవుతుందని చెప్పారు. ప్రభుత్వం నుంచి రూ. 750 కోట్లను జీతాలుగా తీసుకుంటున్న సలహాదారులు ఈ పిచ్చి బ్రాండ్లతో మద్యం బాటిళ్ళను అమాలని సలహా ఇచ్చారన్నారు. 151 సీట్లను ఇచ్చి పాలన చేయమంటే, జగన్ ఓట్ల రాజకీయం చేస్తున్నారు అని విమర్శించారు. అధికారం శాశ్వతం అని భ్రమిస్తున్న జగన్ రైతాంగాన్ని ఏడిపిస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చిన కొద్దినాళ్ళలో రైతులకు సాగు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. పాసు పుస్తకాలపై జగన్ ఫోటో అవసరమా!- నాదెండ్ల మనోహర్. రైతుల పొలాలకు ఇచ్చే పుస్తకాలపై జగన్ ఫోటోలు ఎందుకు వేస్తున్నారు? ఎవరి తాత, ముత్తాతల ఆస్తులపై ఎవరి ఫోటోలు వేస్తున్నారు? గడిచిన ఐదేళ్లు రైతాంగాన్ని అష్టకష్టాల పాలు చేశారు. జనసెనకు విలువలతో కూడిన రాజకీయం చేయడం మాత్రమే తెలుసునని, అందులో భాగంగానే పొత్తు నిర్ణయం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వేంకటేశ్వరావు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ తదితర స్థానిక, మండల స్థాయి టిడిపి, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు .
Guntur Auto Nagar Meeting
ముస్లిం సోదరులకు అండగా పెమ్మసాని. + ఆటోనగర్ మోటార్ ఫీల్డ్ సోదరుల సమావేశంలో పెమ్మసాని. ‘రాష్ట్ర ప్రయోజనార్థం పొత్తు నిర్ణయం జరిగింది. పొత్తు వల్ల ముస్లిం సోదరులకు ఎలాంటి సమస్య ఉండదు, ఇది పెమ్మసాని హామీ’ అంటూ గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. గుంటూరులోని ఆటోనగర్లో గురువారం సాయంత్రం జరిగిన మోటార్ ఫీల్డ్ సోదరుల ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని గారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉండగా దొడ్డిచాటున బిజెపికి సహకారం అందించిందే తప్ప రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోలేదు. కానీ ప్రజా సంక్షేమం దృష్ట్యా, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకలను అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ముందస్తు చర్యలు తీసుకుందని చెప్పారు. ఆటోనగర్లో ఎన్నో ఏళ్లుగా నీటి సౌకర్యాలు అందుబాటులో లేక స్థానికులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. టిడిపి అధికారంలోకి రాగానే నీటి సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. నాయకులతోనూ సంప్రదించి ఇతర సమస్యలపై పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నశీర్ అహ్మద్ మాట్లాడుతూ ఆటోనగర్ అభివృద్ధి చేస్తామంటూ పదేళ్లు వైసిపి ఎమ్మెల్యే కాలయాపన చేశారని, గెలిచిన తర్వాత ఒకసారి కూడా ఆటోనగర్ వైపు తొంగి చూడలేదని విమర్శించారు. టిడిపి అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, టిడిపి నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, ముస్లిం నాయకులు సయ్యద్ ముజీబ్, టిడిపి నాయకులు భరత్ రెడ్డి, డిప్యూటీ మేయర్ షేక్ గౌస్, ఆటోనగర్ యూనియన్ ప్రెసిడెంట్ సయ్యద్ షబ్బీర్ తదితర నాయకులు పాల్గొన్నారు.
Guntur West Road Show
ఇది పెమ్మసాని హామీ. + వచ్చే ఐదేళ్లలో నీటి సమస్య ఉండదు. + నెలవారీ వసూళ్ళలో వైసిపి ‘విడదల’ + పశ్చిమ నియోజకవర్గ పర్యటనలో పెమ్మసాని. ‘గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు రాబోయే ఐదేళ్లలో నీటి సమస్య ఉండదు. ఇది పెమ్మసాని హామీ. సాధారణంగా పదేళ్లలో రావాల్సిన వ్యతిరేకతను రజనీ మూడేళ్లలోనే మూట కట్టుకున్నారు. అందుకే నియోజకవర్గం నుంచి పారిపోయి గుంటూరుకు చేరారు.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు. నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో గల 39 వ డివిజన్లో నియోజకవర్గ అసెంబ్లీ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవితో కలిసి పెమ్మసాని మంగళవారం పర్యటించారు. స్థానిక నేతాజీ నగర్, ఉద్యోగ నగర్, క్రాంతి నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలు స్పందిస్తూ నిత్యం తాగునీరు అందడం లేదని, పారుదల లేని డ్రైనేజీ, మురుగుతో నిండిపోయిన సైడ్ కాలువల వల్ల పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నామని పెమ్మసాని ముందు వాపోయారు. ప్రజా సమస్యలను పూర్తిగా విన్న తర్వాత ఆయన స్పందిస్తూ.. 2014-19 మధ్యన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అందిన నిధుల ద్వారా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మొదలయ్యాయని, అయితే మధ్యలో అవినీతి అధికారుల, నాయకుల కారణంగా ఆ పనులు అటకెక్కాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులను కొందరి అకౌంట్లకు మళ్ళించే ప్రయత్నాలు జరిగాయని, ఎన్నికల తర్వాత పూర్తి వివరాలు బయట పెడతానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గుంటూరులో ప్రస్తుతం పేరుకుపోయిన నీటి సమస్యల పరిష్కారార్థం కొత్తగా నిధులు తేవాల్సిన పనిలేదని, అందుబాటులో ఉన్న సాంకేతికతను, సౌకర్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోగలిగితే చాలు అన్నారు. రాబోయే 8-10 నెలల్లో ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించే అవకాశం ఉందని, ఇది పెమ్మసాని హామీగా చెప్తున్నాను అని ఆయన తెలిపారు. + అవినీతి విడుదల. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని రజనీ పై మూడేళ్లకే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయని, ఆ కారణంతోనే మూడేళ్లకే చిలకలూరిపేట నియోజకవర్గం విడిచిపెట్టి గుంటూరుకు చేరుకున్నారని పెమ్మసాని తెలిపారు. కేబుల్ టీవీ, గ్రానైట్, రేషన్, అక్రమ కట్టడాలు, మున్సిపల్ షాపు కాంప్లెక్స్ లు ఇలా కనపడ్డ ప్రతి రంగం నుంచి నెల నెలా లక్షలకు లక్షలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. అలా సంపాదించిన అవినీతి సొమ్ముతో ఫ్లెక్సీలు, వేయించి రాజకీయాలు చేయాలనే ఆలోచనతో ఆ నాయకురాలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 30 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఆంధ్ర రాష్ట్రం – పిడుగురాళ్ల మాధవి. రాష్ట్రంలో జరుగుతున్న అసమర్ధ పాలన వలన ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తమ ఇల్లు ,వాకిళ్లు వదులుకొని పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సిందే. ఈ దుర్మార్గపు పరిస్థితి నుంచి మార్పు తీసుకురావాలి. పరిశ్రమలను తీసుకువచ్చి, ఉద్యోగావకాశాలను కల్పించాలి. ఆయా అభివృద్ధి, సంక్షేమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఓటు వన్ సైడ్ గా వేయాలని కోరుతున్నాను. ఈ పర్యటనలో టిడిపి నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, ముస్లిం నాయకులు సయ్యద్ ముజీబ్, బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, 42వ డివిజన్ కార్పొరేటర్ వేములపల్లి శ్రీనివాసరావు(బుజ్జి), 39వ డివిజన్ మాజీ కార్పొరేటర్ షేక్ రుస్తుంబాబు అలాగే స్థానిక టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.