గుంటూరులోపెమ్మసాని మార్నింగ్ విజిట్. * వాకింగ్ చేస్తూ బి.ఆర్ స్టేడియం సమస్యలపై ఆరా. * లాలాపేట చిరు వ్యాపారులతో మమేకం. ‘బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధి బాధ్యత టిడిపి తీసుకుంటుంది. క్రికెట్ స్టేడియంతో పాటు వాకర్స్, ఇతర క్రీడలకు సంబంధించిన సౌకర్యాల కల్పనకు కూడా కృషి చేస్తాం.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. పెమ్మసాని తన మార్నింగ్ వాక్ లో భాగంగా గుంటూరులోని స్థానిక బి.ఆర్.రెడ్డి స్టేడియం, లాలాపేట ప్రాంతాలలో పెమ్మసాని శనివారం ఉదయం పర్యటించారు. ముందుగా స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో పరిశీలించిన ఆయన క్రీడాకారులకు కావలసిన కనీస సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం బాస్కెట్ బాల్ కోర్ట్, జిమ్ అలాగే ప్రధాన గ్రౌండ్ ను గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మొహమ్మద్ నజీర్ అహ్మద్ తో కలిసి పరిశీలించారు. స్టేడియం లోకి వెళ్లిన పిదప కాసేపు పలువురు వాకర్స్ తో కలిసి మాట్లాడుకుంటూ మార్నింగ్ వాక్ చేశారు. వాకర్లకు సంబంధించిన స్థానిక సమస్యలతో పాటు స్టేడియం కు సంబంధించిన పలు వివరాలను ఈ సందర్భంగా ఆయన అడిగి తెలుసుకున్నారు. స్టేడియంలో శిథిలావస్థకు చేరిన గ్యాలరీ పరిస్థితులపై వివరాలు సేకరించారు. అలాగే లాలాపేట ప్రాంతంలోని పూలు, పండ్లు విక్రయించుకునే పలువురు చిరు వ్యాపారులను కలుసుకొని మాట్లాడారు. నిత్య జీవన ప్రయాణంలో భాగంగా చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న వెతలపై ఆయన బుధవారం పలు ప్రశ్నలు వేస్తూ ప్రజల నుంచి విలువైన సమాచారాన్ని సేకరించారు. ఈ సందర్భంగా పలువురు చిరు వ్యాపారులు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫు నుంచి పేరుకే సంక్షేమ ఫలాలు ప్రకటిస్తున్నారు తప్ప చేతికి అందేసరికి నీరు గారి పోతున్నాయని వాపోయారు. తిట్కో ఇళ్లకు సంబంధించి అప్పులు చేసి మరి లబ్ధిదారుల వాటా చెల్లించామని ఐదేళ్లు గడుస్తున్న నేటికీ ఇళ్లు కేటాయించకపోవడంపై కొందరు చిరు వ్యాపారులు తమ ఇబ్బందులను పెమ్మసాని గారికి వివరించారు. రోడ్లపై వ్యాపారాలను అడ్డుకుంటూ పలువురు పోలీసులు, అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని, అరకొర వ్యాపారాలతో జీవనం దుర్భరంగా మారిందని చెబుతూ వాపోయారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ యాంత్రిక జీవనంలో వ్యాయామం తప్పనిసరి అని అన్నారు. బిఆర్ స్టేడియంలో క్రికెట్ స్టేడియం గా మార్చాలని ప్రణాళికలతో పాటు వాకర్స్ ఇతర క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు కల్పన కూడా ప్రధానమేనని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ప్రభుత్వం మద్దతు ఇవ్వాలే తప్ప వారి నుంచి కూడా వసూళ్లకు దిగటం అమానవీయమని అన్నారు. మార్నింగ్ వాక్ లో భాగంగా లాలాపేటలోని ఫ్రూట్ మార్కెట్ పట్నం బజార్ బంగారపు షాపుల కోట్లు తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ కార్యక్రమంలో నసీర్ అహ్మద్ తో పాటు పలువురు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు కూడా పాల్గొన్నారు.