కత్తితో కానిది కరుణతో సాధ్యం. * క్రైస్తవ సోదరులతో ఆర్సీఎం చర్చిలో డాక్టర్ పెమ్మసాని కత్తితో సాధ్యం కానిది కరుణతో సాధించగలం. కక్షతో సాధించలేనిది క్షమాభిక్షతో సాధించగలం అన్న ఏసు వాక్యాలను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలి.’ అని గుంటూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని స్థానిక ఏటుకూరు ఆర్సీఎం చర్చ్ లో శుక్రవారం జరిగిన గుడ్ ఫ్రైడే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఉన్నవారికి తాము మేలు చేయడానికి వచ్చామని, నిజమైన సేవ చేయాలని వచ్చిన తమకు సహకరించాలని కోరారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ మానవజాతి బాగుకోసం యేసు శిలువ ఎక్కారని అన్నారు. వెలుతురు వైపు చూడాలి అభివృద్ధి వైపు అడుగులు వేయాలే తప్ప ప్రజలను యాచకులను చేసి, వెన్నెముకలు విరగ్గొట్టే నాయకులను దరి చేరనివ్వకూడదని తెలిపారు. అనంతరం ఫాదర్ బాలసౌరి ఇరువురు నాయకులను ఉద్దేశించి ప్రార్థనలు చేసి, ఆశీర్వాదం అందజేశారు.
Event Photos
Candid Videos Link