మార్నింగ్ వాక్ విత్ పెమ్మసాని. * వాకింగ్ ట్రాక్ లను పరిశీలించిన డాక్టర్ పెమ్మసాని. ‘యాంత్రిక జీవనంలో ప్రతి మనిషికి వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామానికి అవసరమైన యాంత్రిక సామగ్రిని ఏర్పాటు చేయడానికి నా వంతు కృషి చేస్తాను.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. నగరంలోని స్థానిక కొరిటేపాడు బ్యాంకు బండ్ వాకర్స్, గుజ్జన గుండ్ల వాకర్స్ గ్రౌండ్ లను పెమ్మసాని ఆదివారం పరిశీలించారు. వ్యాయామంలో భాగంగా ఆయన గ్రౌండ్ కు వెళ్లి అక్కడి వాకర్లతో మాట్లాడుతూ మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా పలువురు వాకర్లు పెమ్మసానితో మాట్లాడుతూ గతంలో గ్రీన్ ఆంధ్ర తరఫున రూ. 3.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఆయా నిధులతో నగరంలోని వాకర్స్ గ్రౌండ్లలో స్ట్రీట్ లైట్లు గ్రౌండ్ లెవెల్ వాటర్ సౌకర్యం తదితరాలను ఏర్పాటు చేయడానికి అప్పట్లో అధికారులు ప్రయత్నించారు కానీ చేయలేదు అని వివరించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ నగరంలోని వాకింగ్ ట్రాక్లను అభివృద్ధి చేస్తే ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుంది అని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాకింగ్ ట్రాక్లలో బ్యూటిఫికేషన్ చేపట్టే బాధ్యత తీసుకుంటామని అలాగే వాకింగ్ ట్రాక్ల కోసం విడుదలైన ప్రతి రూపాయిని వాటి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.