టిడిపి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దు. తాడికొండ, ఫిరంగిపురం మండలాల పర్యటనలో పెమ్మసాని ‘ప్రజల ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం దగ్గర ఎందుకు ఉంచాలి. ఒరిజినల్ దస్తావేజులు ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలు జిరాక్స్ కాగితాలతో లావాదేవీలు ఎలా జరుపుతారు. తమ ఆస్తులు ఉన్నాయో! ఊడాయో! ప్రభుత్వం దయతలిస్తే గాని ప్రజలు తెలుసుకోలేని పరిస్థితి రాదని గ్యారెంటీ ఏంటి?’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ ఫేమస్ అని చంద్రశేఖర్ గారు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాడికొండ నియోజకవర్గ పర్యటనను పెమ్మసాని నిర్వహించారు. పర్యటనలో భాగంగా ముందుగా తాడికొండ మండలం మోతడక, నిడుముక్కల, బడే పురం గ్రామాల్లో, అనంతరం ఫిరంగిపురం మండలంలోని 113 తాళ్లూరు, ఎర్రగుంట్ల పాడు, బేతపూడి గుండాలపాడు పొనుగుపాడు గ్రామాల్లో అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ గారితో కలిసి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ… మన ఇంట్లో మనకు సంబంధించిన ఆస్తుల డాక్యుమెంట్లు ఉంటేనే భయం భయంగా గడుపుతాం. అలాంటిది సొంత ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం చేతులో పెట్టి జిరాక్స్ కాపీలు మాత్రం మనవద్ద పెట్టుకొని ఎలా ధైర్యంగా ఉండగలం? ప్రజలారా ఒకటే చెబుతున్నాను ఈ నెల రోజులు ఎవరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు. టిడిపి ప్రభుత్వం రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తాం. కచ్చితంగా ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తాం. * ప్రజలు ఓట్లేసే ముందు ఒకసారి ఆలోచించండి. మీరు నిలబడ్డ రోడ్లు ఎవరు నిర్మింప చేశారో గుర్తు చేసుకోండి. 2014-19 మధ్యలో టీడీపీ ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప వైసిపి ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేయలేదు. మీలో ఎంతోమంది యువకులు చదువులు పూర్తి చేసుకుని బయటికి వస్తున్నారు. కానీ అలా వచ్చిన వారికి ఉద్యోగాలు దొరుకుతున్నాయా లేదా? ఒకసారి ఆలోచించుకోండి. పనిచేసే వారికి డిమాండ్ పెరిగితే రోజుకు రూ. 500-1000లు కంటే ఎక్కువే ఆదాయం రావచ్చు. అప్పుడే మీరు సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి అవకాశాలు మెరుగవుతాయి. ఉదయం పూట సంక్షేమం డబ్బులు చేతిలో పెట్టి, సాయంత్రానికి కల్తీ మద్యం పేరిట అంతకు రెట్టింపు సొమ్మును జగన్ ప్రభుత్వం, నాయకులు లాక్కుంటున్నారు. అదేమని ప్రశ్నిస్తే ఆ బ్రాండ్ లు టిడిపి హయాంలో రిజిస్టర్ అయ్యాయి అంటారు. టిడిపి టైంలో రిజిస్టర్ అయ్యుంటే కల్తీ మద్యం పై అప్పట్లో జగన్ అండ్ కో ఎందుకు ప్రశ్నించలేదు? అని అడుగుతున్నాను. రాజధాని ప్రాంతంలో వేల ఎకరాలు ప్రభుత్వానికి అప్పజెప్పినా ఒక్క రూపాయి అవినీతి లేకుండా శ్రావణ్ కుమార్ గారు పని చేశారు. * సుచరిత గారికి పేరుకు మాత్రమే హోం మంత్రి పదవి ఇచ్చారు తప్ప, అధికారం మొత్తం సజ్జల చేతుల్లోనే ఉంది. ఆమె కుటుంబం మొత్తం కలెక్షన్ల మీదే దృష్టి పెట్టారు తప్ప ప్రజా సంక్షేమం గురించి ఏ రోజు పట్టించుకోలేదు. కానీ శ్రావణ్ కుమార్ గారు ఆయన కుటుంబం ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదు. రాబోయే ఎన్నికల్లో టిడిపి గెలవబోతోంది. ఇదే వాస్తవం. అనవసరంగా మునిగిపోయే పడవకు ఓటు వేసి మీ ఓట్లను మురిగిపోయేలా చేసుకోవద్దు. బాబు గారితో మేము పేదలకు ఇళ్ళు నిర్మింపజేసి ఇవ్వడం గురించి మాట్లాడాము. మీ ఓట్లు టిడిపికి వేసి గెలిపించండి. ప్రజల ఇంటి సమస్యలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. తెనాలి శ్రావణ్ కుమార్ గారు: మద్యం తాగితే నష్టం జరుగుతుందని నియోజకవర్గంలో తొలుత నేనే చెప్పాను. మహిళలతో కలిసి వెళ్లి మద్యం షాపులు కూడా మూయించాను. ఇప్పటికైనా మద్యం మాని మీ ఆరోగ్యాలు కుదుటపరచుకోండి. ఎన్నికల తరువాత ఐఏఎస్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయించి నియోజక వర్గ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తాను. వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయించి, ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తాం. ఈ పర్యటనలో గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు డేగల ప్రభాకర్, బీసీ నాయకులు నిమ్మల శేషయ్య, మైనారిటీ నాయకులు సయ్యద్ ముజీబ్, తాడికొండ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బేతపూడి విజయ్ శేఖర్ తదితర టిడిపి బిజెపి జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Event Photos
Final Speech
- https://drive.google.com/file/d/1RD_gouymdU9zXjJhJ9yoj2ZWBwsxRwDP/view?usp=sharing
- https://drive.google.com/file/d/1XxCj6JHutXfUBLhiBYXy-rzzSFVInUgT/view?usp=sharing
- https://drive.google.com/file/d/1Wa00dT6OFUoZDhWgGHxW3tc8Bf-omKX3/view?usp=sharing
- https://drive.google.com/file/d/17qIpD8YMIY2V-QPZsrgl_0A21BUo9aeI/view?usp=sharing.
- https://drive.google.com/file/d/1mkteBucRe0p-DlBwBq7QAx4eRiTThN8c/view?usp=sharing
- https://drive.google.com/file/d/1-sBv628HCSBq6shki7uujGtjAM9izPMu/view?usp=sharing
- https://drive.google.com/file/d/1ynpYOEwzy5J9EA2J7m4nWgvCgX56Y5c4/view?usp=sharing
Camera Videos Link