ఆలపాటి జన్మదిన వేడుకల్లో పెమ్మసాని. ‘నిండు నూరేళ్లు ఇలాంటి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలి. ప్రజా సంక్షేమం కోరే రాజా గారు వంటి నాయకులు ప్రజలకు ఎల్లకాలం అందుబాటులో ఉండాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభిలాషించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి 64వ పుట్టినరోజు సందర్భంగా గుంటూరులోని ఆలపాటి నివాసంలో డాక్టర్ పెమ్మసాని గురువారం కలిశారు. ఆలపాటిని కలిసిన పెమ్మసాని ముందుగా గౌరవ సత్కారం చేసిన అనంతరం ఆలపాటికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆలపాటి మాట్లాడుతూ ఎన్నికల బిజీ షెడ్యూల్ సమయంలోనూ తన పుట్టినరోజును గుర్తుంచుకొని ఇంటికి వచ్చి మరీ శుభాకాంక్షలు తెలియజేసిన పెమ్మసాని వ్యక్తిత్వాన్ని ఆయన అభినందించారు. పెమ్మసాని వంటి నాయకులు మన పార్లమెంట్ కు రావడం గుంటూరు జిల్లా వాసుల అదృష్టమని తెలియజేశారు.