వందల లారీల ఇసుక తరలించకపోతున్నారు. * భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. * మా జోలికొస్తే మాత్రం గాంధీగిరి చెల్లదు * కొల్లిపర మండల టిడిపి-జనసేన నాయకుల ఆత్మీయ సమావేశంలో డాక్టర్ పెమ్మసాని. ‘నేను ఈరోజు ఇంతటి వాడిని కావడానికి అమెరికాలోని శ్వేత, నల్ల జాతీయులే కారణం. కానీ ఏపీలోని ఈ ప్రభుత్వం దిక్కుమాలిన కుల రాజకీయాలతో అంటకాగుతోంది. నాకు నష్టం జరిగినా పర్వాలేదు కానీ, నా కార్యకర్తలు, నాయకుల జోలికి వస్తే ఊరుకోబోం, చెయ్యి ఎత్తుతానంటే గాంధీగిరి అంటూ కూర్చోలేం. ఈ గడ్డ పెమ్మసాని అడ్డాగా మార్చి తీరుతాం.’ అంటూ టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. తెనాలి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన తెనాలి, కొల్లిపర, అంగలకుదురు తదితర ప్రాంతాల్లో గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కొల్లిపర మండల టిడిపి, జనసేన, బిజెపి నాయకుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా నాదెండ్ల మనోహర్ తో కలిసి డాక్టర్ పెమ్మసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తర్వాత ఆయన చేసిన అభివృద్ధిని వైఎస్ఆర్ కొనసాగించారని, కానీ జగన్ మాత్రం 33 వేల ఎకరాలు రాజధాని నిమిత్తం ఇచ్చిన రైతులను వేధిస్తున్నారని పేర్కొన్నారు. ఓవైపు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే గంజాయి సరఫరా చేయిస్తూ యువత భవితవ్యంతో ఆడుకుంటున్నారు అని, మరోవైపు తెనాలి ఎమ్మెల్యే నదీ జలాల్లోని ఇసుకను అడ్డగోలుగా అక్రమ రవాణా చేయిస్తున్నారని, ఇలా ప్రజా జీవితంతో ఆటలాడుకుంటున్న దుర్మార్గపు నాయకులకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోవడమే కాక భారీ వాహనాల ప్రయాణాల వల్ల రోడ్లన్నీ గుంతలు పడిపోయి వాహనదారులకు ప్రాణాపాయంగా మారుతున్నాయని తెలిపారు. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అని తాము నమ్ముతామే తప్ప, తమ జోలికొస్తే మాత్రం గాంధీ గిరి అంటూ చేతులు కట్టుకుని కూర్చోబోమని ఆయన ఈ సందర్భంగా కొందరు వైసీపీ నాయకులకు హెచ్చరిక జారీ చేశారు. తమకు, తమ పార్టీకి అండగా ఉన్న నాయకులు, కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. అనంతరం టిడిపి జనసేన కూటమి తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొల్లిపర మండలం వ్యవసాయపరంగా ఎంతో వృద్ధి చెందిందని, తాగు, సాగు నీటి అవసరాల రీత్యా తాను ఎన్నో సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన రూ. లక్ష సాయం అందించారని, ఆ జాబితాలో కొల్లిపర రైతులు ఉండడం చూసి తన గుండె తరుక్కుపోయింది అన్నారు. త్వరలో రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ఏ ఒక్క ఓటు దారి మళ్లకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రైతు సంఘ అధ్యక్షుడు వంగా సాంబి రెడ్డి తదితర టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు. పర్యటన వివరాలు. ఉదయం నందులపేటలోని స్థానిక కాళీ మాత దేవస్థానంలో దర్శనం చేసుకున్న డా. పెమ్మసాని చంద్రశేఖర్ అనంతరం స్థానిక కవిరాజా పార్కు రోడ్డు, లెనిన్ రోడ్డు, టీ ఎన్ సీ క్లబ్ రోడ్డు, యడ్లపాడు వెంకటరావు రోడ్డు, బీసీ కాలనీ, నరేంద్ర దేవ్ కాలనీ తదితర ప్రాంతాల్లో టీడీపీ – జనసేన కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తో కలిసి పర్యటించారు. పలుచోట్ల అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. సాయంత్రం అంగలకుదురు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పెమ్మసాని అనంతరం రోడ్డు షో లో పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామ వీధుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి అందరిని కలుసుకున్నారు. ఈ పర్యటనలో టిడిపి నాయకులు వీరవల్లి మురళి, గ్రామ ఉపసర్పంచ్ కనగాల నాగభూషణం, జడ్పిటిసి అన్నాబత్తుని జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Candid Videos Link