సర్వమత సామరస్యంగా ఇఫ్తార్ విందు. * ఇఫ్తార్ విందులో డాక్టర్ పెమ్మసాని. ‘ఇఫ్తార్ విందును సర్వమత సామరస్యంగా నిర్వహించడంపై గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. నగరంలోని 23వ డివిజన్లో నగరంపాలెంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు డాక్టర్ పెమ్మసాని బుధవారం పాల్గొన్నారు. ప్రవక్త ఆదేశానుసారం రంజాన్ మాసంలో కఠోర ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు పెమ్మసాని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కులం, మతంతో సంబంధం లేకుండా అన్ని మతాల వ్యక్తులు కలిసి ఇఫ్తార్ విందులో భోజనాలు చేయడం చాలా ఆనందంగా ఉందని పెమ్మసాని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ ఇఫ్తార్ విందును మాజీ కార్పొరేటర్ వర్ధన రావుతోపాటు నగర క్రిస్టియన్ సెల్ నాయకులు కారంగి అనిల్ కుమార్, గంటా పెద్దబ్బాయి, షరీఫ్, ఫణి తదితరుల ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందును నిర్వహించారు.