నిజమైన నాయకుడిని ఎన్నుకోండి. * విద్యార్థులతో డా. పెమ్మసాని. ‘మెజారిటీ సీట్లు ఇవ్వండి, పనిచేయకపోతే ప్రశ్నించండి.’ అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కే ఎల్ యూ కాలేజీ ఆవరణలో బుధవారం జరిగిన ‘ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్’ విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి పెమ్మసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత చైతన్యవంతులైతే రాక్షస పాలనకు స్వస్తి పలికినట్టేనని, రూ. 5 వేల జీతాలకు వాలంటీర్ ఉద్యోగాలు చేతిలో పెట్టి, వేలకొద్దీ ఉద్యోగాలు ఇచ్చేసామని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటు అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే మన అమరావతి కూడా హైదరాబాద్ తరహాలో అభివృద్ధి జరిగేదని పెమ్మసాని తెలిపారు. సమీప భవిష్యత్తులో జగన్ కనిపించకుండా యువత ఓటు వేయాలని ఆయన యువతను కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మీడియా కో – ఆర్డినేటర్ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ మోదీ దగ్గరకు వెళ్ళి అమరావతి గురించి మాట్లాడగల తొలి వ్యక్తి పెమ్మసానేనని చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత పడవల మహేష్, గుంటూరు పార్లమెంటరీ తెలుగు యువత జంగాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Event Photos
Candid Videos Link